Tata Cars : టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఆగస్టులో రూ. 1.05 లక్షల వరకు ఆదా చేసుకోండి
టాటా మోటార్స్ కార్లు వాటి దృఢమైన బాడీ, సేఫ్టీ బాగా పేరు పొందాయి. ఈ ఆగస్టు నెలలో కొత్త టాటా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకో మంచి అవకాశం.
Tata Cars : టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఆగస్టులో రూ. 1.05 లక్షల వరకు ఆదా చేసుకోండి
Tata Cars : టాటా మోటార్స్ కార్లు వాటి దృఢమైన బాడీ, సేఫ్టీ బాగా పేరు పొందాయి. ఈ ఆగస్టు నెలలో కొత్త టాటా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకో మంచి అవకాశం. టాటా తన ప్రముఖ మోడల్స్‌పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లతో ఏకంగా రూ.1.05 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆగస్టులో ఏ ఏ టాటా కార్లపై ఎంతెంత డిస్కౌంట్లు లభిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
టాటా టియాగో: టాటా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన టియాగోపై ఆగస్టులో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. టియాగో ఎక్స్-ఈ (XE) మోడల్ మినహా, మిగతా అన్ని వేరియంట్లపై రూ.55,000 వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, అలాగే రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి.
టాటా పంచ్: టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో పంచ్ ఒకటి. దీని సీఎన్‌జీ వేరియంట్‌పై ఈ నెలలో రూ. 85,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ.30,000 క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇక, పెట్రోల్ వేరియంట్‌పై రూ. 65,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు.
టాటా హారియర్: హారియర్ స్మార్ట్, ఫియర్‌లెస్ వేరియంట్లపై రూ. 80,000 వరకు తగ్గింపు ఉంది. మిగతా అన్ని వేరియంట్లపై ఏకంగా రూ. 1.05 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 50,000 క్యాష్ బెనిఫిట్ కూడా ఉంది.
టాటా సఫారి: హారియర్ లాగే, సఫారి అప్‌డేట్ కాని మోడల్స్‌పై కూడా రూ. 1.05 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇది టాటా కార్లలో లభిస్తున్న అత్యధిక డిస్కౌంట్లలో ఒకటి.
టాటా కర్వ్
టాటా మోటార్స్ నుండి రానున్న మొదటి కూపే ఎస్‌యూవీ అయిన టాటా కర్వ్ కారుపై కూడా డిస్కౌంట్ ఉంది. ఈ కారుపై ఈ ఆగస్టు నెలలో రూ. 30,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ తగ్గింపు కేవలం ఎక్స్ఛేంజ్, స్క్రాప్ బోనస్‌ల రూపంలో లభిస్తుంది.