Skoda Kushaq: అదరగొట్టిన స్కోడా.. ధర కేవలం రూ.10.99లక్షలే.. క్రెటా, విటారాకు చుక్కలే
Skoda Kushaq: స్కోడా కుషాక్ అనే ఎస్‌యూవీ కారు భారతదేశంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయ్యింది. ఈ 4 ఏళ్లలో ఇది చాలా పెద్ద సంఖ్యలో యూనిట్లను విక్రయించింది. కంపెనీ లెక్కల ప్రకారం, స్కోడా మొత్తం అమ్మిన ఎస్‌యూవీల్లో దాదాపు 77% కుషాక్ కార్లే ఉన్నాయి.
Skoda Kushaq: స్కోడా కుషాక్ అనే ఎస్‌యూవీ కారు భారతదేశంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయ్యింది. ఈ 4 ఏళ్లలో ఇది చాలా పెద్ద సంఖ్యలో యూనిట్లను విక్రయించింది. కంపెనీ లెక్కల ప్రకారం, స్కోడా మొత్తం అమ్మిన ఎస్‌యూవీల్లో దాదాపు 77% కుషాక్ కార్లే ఉన్నాయి. అంటే, కుషాక్ వల్లే స్కోడా కంపెనీ మన దేశంలో ఎస్‌యూవీ మార్కెట్లో బలంగా నిలబడింది. ఈ కుషాక్ కారును పుణేలోని ఫ్యాక్టరీలోనే దాదాపు 95% వరకు దేశంలో తయారైన పార్ట్స్‌తో చేశారు. ఇది స్కోడా సంస్థ 'ఇండియా 2.0' అనే ప్రత్యేక ప్రోగ్రాం కింద దేశం కోసమే తయారు చేసిన మొదటి కారు. తక్కువ ధరలో మంచి క్వాలిటీ కార్లు ఇవ్వడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం.
కుషాక్ కారులో పెట్రోల్ ఇంజిన్లు మాత్రమే ఉన్నాయి. రెండు రకాల టర్బో పెట్రోల్ ఇంజిన్లు దొరుకుతాయి – ఒకటి 1.0 లీటర్, మరొకటి 1.5 లీటర్. రెండింటిలోనూ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కారు నడపడానికి చాలా బాగుంటుంది. రోడ్డుపై పట్టు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ మీటర్, కూలింగ్ సీట్లు, ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్, ఫోన్ ఛార్జింగ్ కోసం వైర్‌లెస్ ఛార్జర్ లాంటివి ఉన్నాయి. దీని ధర రూ.10.99 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ అయితే రూ.19.01 లక్షల వరకు ఉంటుంది.
భారత మార్కెట్లో కుషాక్‌కు చాలా పోటీ ఉంది. హుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా లాంటి పెద్ద కార్లతో ఇది పోటీ పడుతుంది. అయినా, కుషాక్ తనదైన స్టైల్‌తో, మంచి పర్ఫార్మెన్స్‌తో చాలా మందిని ఆకట్టుకుంది. మొత్తంమీద, స్కోడా కుషాక్ డబ్బుకు తగ్గ విలువను ఇస్తూ, మంచి ఫీచర్లు, సేఫ్టీతో భారతీయ రోడ్లపై దూసుకుపోతోంది.