Royal Enfield: అమ్మకాల్లో దూసుకుపోతున్న హంటర్.. క్లాసిక్, బుల్లెట్లకు షాక్

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ అనగానే గంభీరమైన శబ్దం గుర్తొస్తుంది. చాలా కాలంగా క్లాసిక్ 350, బుల్లెట్ బైకులే ఎక్కువగా అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

Update: 2025-06-12 12:37 GMT

Royal Enfield: అమ్మకాల్లో దూసుకుపోతున్న హంటర్.. క్లాసిక్, బుల్లెట్లకు షాక్

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ అనగానే గంభీరమైన శబ్దం గుర్తొస్తుంది. చాలా కాలంగా క్లాసిక్ 350, బుల్లెట్ బైకులే ఎక్కువగా అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా తెచ్చిన హంటర్ 350 బైక్ మార్కెట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రూ. 1.50 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన హంటర్ 350, బైక్ లవర్స్‌కి బాగా నచ్చింది. క్లాసిక్, బుల్లెట్ బైకుల అమ్మకాలను కూడా ఈ హంటర్ 350 దాటేసింది. హంటర్ 350 బైక్‌ను యూత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దాని స్టైలిష్ లుక్, చిన్న సైజ్ బాడీ, ఆధునిక ఫీచర్లు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. పట్టణాల్లో నడపడానికి ఈ బైక్ చాలా బాగుంది. తక్కువ బరువు, సులువుగా కంట్రోల్ చేయగలిగే హ్యాండ్లింగ్ వల్ల ట్రాఫిక్‌లో కూడా హాయిగా నడపొచ్చు.

మే 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 89,429 బైకులను అమ్మింది. ఏప్రిల్ 2025లో అమ్ముడైన 86,559 యూనిట్ల కంటే ఇది 3.3శాతం ఎక్కువ. ఈ మొత్తం అమ్మకాల్లో హంటర్ 350 అమ్మకాలు చాలా ఎక్కువ. ఏప్రిల్ 2025లో హంటర్ 350 18,109 యూనిట్లను అమ్మింది. మార్చి 2025లో అమ్ముడైన 16,958 యూనిట్ల కంటే ఇది 6.7శాతం ఎక్కువ. అంతేకాదు గతేడాది ఏప్రిల్ (2024)లో అమ్ముడైన 16,186 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో హంటర్ అమ్మకాలు 11.8శాతం పెరిగాయి.

క్లాసిక్, బుల్లెట్ బైకులు వాటి బరువైన బాడీ, పాత కాలపు లుక్‌తో ఫేమస్ అయ్యాయి. కానీ హంటర్ బైక్ లేటెస్ట్ స్టైల్‌తో వచ్చింది. స్టైల్‌తో పాటు బడ్జెట్‌ను కూడా చూసుకునే యువతకు ఈ బైక్ పర్ఫెక్ట్ ఎంపిక అని చెప్పొచ్చు.

హంటర్ 350లో 349cc J-సిరీస్ ఇంజిన్ ఉంది. ఇదే ఇంజిన్ క్లాసిక్ 350లో కూడా ఉంటుంది. కానీ హంటర్ కోసం ఈ ఇంజిన్‌ను కొత్త ఫ్రేమ్, గేరింగ్‌తో మార్చారు. దీనివల్ల బైక్ త్వరగా స్పందిస్తుంది. క్లాసిక్‌తో పోలిస్తే దీని బరువు తక్కువ. కాబట్టి దీని పిక్ అప్, మైలేజ్ రెండూ మెరుగ్గా ఉన్నాయి. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్, డిజిటల్-అనలాగ్ మీటర్, USB ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి ఈ రోజుల్లో బైకర్లకు చాలా అవసరం. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల రిపోర్టులు చూస్తే, హంటర్ 350కి డిమాండ్ పెరుగుతూనే ఉందని తెలుస్తోంది. చాలా నెలలుగా క్లాసిక్, బుల్లెట్ బైకుల కంటే హంటరే ఎక్కువ అమ్ముడవుతోంది. రాబోయే రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల్లో ఈ బైక్ మరింత కీలక పాత్ర పోషించడం ఖాయం.

Tags:    

Similar News