Upcoming Compact SUVs: అత్యాధునిక హుంగులతో కొత్త కార్లు వస్తున్నాయ్.. లాంచ్ అప్పుడే
Upcoming Compact SUVs: అత్యాధునిక హుంగులతో కొత్త కార్లు వస్తున్నాయ్.. లాంచ్ అప్పుడే
Upcoming Compact SUVs: భారతదేశంలో సబ్ ఫోర్ మీటర్ లేదా కాంపాక్ట్ ఎస్‌యూవీ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని విభాగాలను వదిలి ఈ సెగ్మెంట్‌లో తమ లేటెస్ట్ కార్లను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిలో మారుతి సుజుకి, రెనాల్ట్, టాటా, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయి. రెనాల్ట్, టాటా ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ రెండు వాహనాల్లో ప్రత్యేకత ఏముంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Renault Kiger Facelift
రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ సంవత్సరం భారతీయ కార్ మార్కెట్లో విడుదల చేయచ్చు. ఈ వాహనం టెస్టింగ్ సమయంలో కనిపించింది. కిగర్ భారతదేశంలో విజయవంతం కాని కారు. దీని అమ్మకాలు కూడా అంత బాగా లేవు. కానీ కొత్త మోడల్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని నమ్ముతారు. నివేదికల ప్రకారం, కొత్త కిగర్ ఫేస్‌లిఫ్ట్ ధర కొంచెం ఎక్కువగా ఉండచ్చు.
ప్రస్తుతం ఉన్న మోడల్ ధరతో పోలిస్తే కొత్త మోడల్ ధర రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉండచ్చు. ప్రస్తుతం కిగర్ ధర రూ.6.10 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు ఉంది. ఇందులో 1.0L పెట్రోల్ ఇంజన్ ఉండొచ్చు. దీనిలో టర్బో ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.
Tata Punch Facelift
టాటా మోటార్స్ ఇప్పుడు దాని ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకువస్తోంది. ఈసారి కొత్త పంచ్‌లో చాలా పెద్ద మార్పులను చూడచ్చు, నివేదికల ప్రకారం. కొత్త ఫేస్‌లిఫ్ట్ పంచ్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుత మోడల్‌లో 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇదే కొత్త మోడల్‌లో కూడా ఉండే అవకాశం ఉంది.
ఫీచర్ల విషయానికి వస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో 10.25 మీటర్ల కన్సోల్,ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. భద్రతా ఫీచర్ల కోసం, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఇవ్వచ్చు. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే రూ.20 వేల వరకు ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఈ ఎస్‌యూవీ భారీ మార్పులతో రాబోతోందని భావిస్తున్నారు.