Renault Kiger Facelift: హెటెక్ ఫీచర్లతో రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే..?
Renault Kiger Facelift: భారత్ ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు చాలా పెద్ద మార్కెట్. ఈ విభాగంలో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్సెటర్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
Renault Kiger Facelift: హెటెక్ ఫీచర్లతో రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే..?
Renault Kiger Facelift: భారత్ ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు చాలా పెద్ద మార్కెట్. ఈ విభాగంలో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్సెటర్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రెనాల్ట్ కిగర్ కూడా ఇదే విభాగంలో ఉంది. అయితే ఈ కారు అమ్మకాల పరంగా నిరాశపరుస్తుంది. డిజైన్ పరంగా కూడా ఈ కారు ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో కంపెనీ కిగర్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువస్తోంది. ఇటీవల కంపెనీ ఈ కారును కొన్ని కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. రండి దీని గురించి పూర్తి వివవరాలు తెలుసుకుందాం.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. కిగర్ ఫేస్‌లిఫ్ట్ ధర కొంచెం ఎక్కువగా ఉండచ్చు. ప్రస్తుతం ఉన్న మోడల్ ధరతో పోలిస్తే కొత్త మోడల్ ధర రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కిగర్ ధర రూ.6.10 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు ఉంది.
ఇటీవల అప్‌డేట్ చేసిన కిగర్‌లో కొన్ని కొత్త ఫీచర్స్ ఉంటాయి. ఈ వాహనంలో 17 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ చూడచ్చు. కానీ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే కంపెనీ కొత్త మోడల్‌ను పూర్తిగా మార్చబోతోంది. తద్వారా కొత్త మోడల్ మార్కెట్లో తన పట్టును బలోపేతం చేస్తుంది.
ఇటీవల రెనాల్ట్ సీఎన్‌జీ కిగర్‌లో కూడా పరిచయం చేసింది. అయితే సీఎన్‌జీ కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే రూ.79500 చెల్లించాలి. సీఎన్‌జీ కిట్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లయితే వాహనంపై ఎటువంటి వారంటీ ఉండదు. కిట్‌పై కంపెనీ స్వయంగా మూడు సంవత్సరాల వారంటీని ఇస్తుంది. ఢిల్లీ, యుపి, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రెనాల్ట్ సిఎన్‌జి కార్లను ముందుగా ఇవ్వనున్నారు.
కొత్త మోడల్‌లో కూడా భద్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ఈబీడీ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుంగా బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ వాహనంలో ఉంటాయి. ఈ కారు క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. కొత్త కిగర్‌ను త్వరలో భారత్ రోడ్లపైకి రానుంది.