Discount On EV Cars: ఈ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే టెంప్ట్ అవడం పక్కా
Discount On EV Cars: ఈ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే టెంప్ట్ అవడం పక్కా
Discounts On EV Cars: కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. కార్ డీలర్‌షిప్‌ల వద్ద గత సంవత్సరం పాత ఇన్వెంటరీ ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా పెద్ద సంఖ్యలో పాత వాహనాల స్టాక్ మిగిలి ఉన్నాయి. ఆడిటింగ్, సేల్ రికార్డ్ వంటి లెక్కల్లో క్లారిటీ కోసం కార్ల కంపెనీలు మార్చి 31లోపు ఆ స్టాక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై కంపెనీలు భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. MG మోటార్స్ ఫేమస్ ZS ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై మంచి తగ్గింపును అందించింది. జనవరి 2025లో కంపెనీ ZS EV ధరలను పెంచింది. ఆ తర్వాత ఇప్పుడు డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది.
MG ZS EV
ఈ ఏడాది జనవరిలో MG ZS EV ధరలను రూ. 50,000 నుండి రూ. 1.20 లక్షల వరకు పెంచింది. అయితే ఇప్పుడు వినియోగదారులకు భారీ డిస్కౌంట్స్ కూడా అందిస్తోంది. MG ZS EV SUVపై రూ. 2.50 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆఫర్ల గురించి మరింత సమాచారం కోసం మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించండి.
ఎంజీ జెడ్ ఎస్ ఈవీలో 50.3కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 174 బిహెచ్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ వాహనాన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 60-65 నిమిషాలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును కేవలం 60 నిమిషాల్లో 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కారు కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.98 లక్షల నుండి మొదలై రూ. 26.64 లక్షల వరకు ఉంటుంది. భద్రత కోసం, ఇందులో ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సన్‌రూఫ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, 10.11-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
Hyundai Ioniq 5
మీరు ఈ నెలలో హ్యుందాయ్ ఐయోనిక్ 5 MY2024 మోడల్‌ని కొనుగోలు చేయడం ద్వారా డిస్కౌంట్ రూపంలో మీకు రూ. 4 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీరు మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎక్స్-షోరూమ్ ధర రూ. 46.05 లక్షలుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
Tata Punch EV
టాటా మోటార్స్ పంచ్ ఈవీ MY2024 మోడల్‌పై గరిష్టంగా రూ. 70,000 వరకు తగ్గింపును అందిస్తోంది. MY2025 మోడల్‌కు రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది కదా!!