MG Aster: కార్ల కొనుగోలు దారులకు షాక్..ఆ మోడల్స్‌పై ధరలను పెంచిన ఎంజీ మోటార్స్..!

MG Motors: MG మోటార్ ఇండియా తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను పెంచింది. ఇది నేటి నుంచి అమలులోకి వస్తుంది.

Update: 2024-04-12 15:30 GMT

MG Aster: కార్ల కొనుగోలు దారులకు షాక్..ఆ మోడల్స్‌పై ధరలను పెంచిన ఎంజీ మోటార్స్..! 

MG Motors: MG మోటార్ ఇండియా తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను పెంచింది. ఇది నేటి నుంచి అమలులోకి వస్తుంది. ఇటీవల టాటా టియాగో EVకి పోటీగా ఉండే కామెట్ EV ధరలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో అమ్మకాలు పెంచేందుకు MG నిరంతరం ప్రయత్నిస్తుంది.

ఇప్పుడు దాని సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తో పోటీ పడుతున్న MG Aster ఈ మిడ్ సైజ్ SUV గురించి మాట్లాడుకుందాం. దీని ధర రూ. 20,000 పెరిగింది. ఈ ధర మార్పులు దాని షార్ప్ ప్రో 1.5 MT ఐవరీ, షార్ప్ ప్రో 1.5 CVT ఐవరీ, Savvy Pro 1.5 CVT ఐవరీ, Savvy Pro 1.5 CVT సాంగ్రియాలకు వర్తిస్తాయి. అయితే, దీని ఎంట్రీ లెవల్, టాప్ మోడల్స్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆస్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.98 లక్షల నుంచి మొదలై రూ. 17.90 లక్షల వరకు ఉంటుంది.

MG ఆస్టర్ స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, సావీ ప్రో ఐదు వేరియంట్‌లలో అందించింది. కస్టమర్‌లు స్టార్రీ బ్లాక్, క్యాండీ వైట్, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, హవానా గ్రే, కాండీ వైట్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

Tags:    

Similar News