Jeep Offers: జీప్ కంపెనీ జూన్ ధమాకా ఆఫర్స్.. ఏకంగా 3 లక్షల డిస్కౌంట్

Jeep Offers: ఇండియన్ మార్కెట్‌లో ఎస్‌యూవీలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పోటీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న జీప్ కంపెనీ జూన్ 2025లో కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది.

Update: 2025-06-17 12:00 GMT

Jeep Offers: జీప్ కంపెనీ జూన్ ధమాకా ఆఫర్స్.. ఏకంగా 3 లక్షల డిస్కౌంట్

Jeep Offers: ఇండియన్ మార్కెట్‌లో ఎస్‌యూవీలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పోటీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న జీప్ కంపెనీ జూన్ 2025లో కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ఇటాలియన్-అమెరికన్ ఆటోమొబైల్ సంస్థ అయిన జీప్, తమ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలైన కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీలపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్లు చూస్తుంటే టయోటా వంటి ప్రత్యర్థి కంపెనీలకు టెన్షన్ పెరిగే అవకాశం ఉంది.

జీప్ డీలర్‌షిప్‌ల వద్ద పాత మోడల్ స్టాక్ చాలా ఎక్కువగా పేరుకుపోయింది. ఈ స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయడానికి కంపెనీ ఈ లిమిటెడ్ టైం ఆఫర్లను ప్రకటించింది. ఎప్పటినుంచో జీప్ ఎస్‌యూవీ కొనాలని ఆలోచిస్తున్న వాళ్లకు ఈ జూన్ నెల కొనేందుకు కరెక్ట్ టైం. జీప్ కంపాస్, ఈ సెగ్మెంట్‌లో చాలా పాపులర్ అయిన మోడల్. దీనిపై కంపెనీ మొత్తం రూ. 2.95 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపులు కన్స్యూమర్ డిస్కౌంట్ కింద రూ. 1.70 లక్షలు, కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ. 1.10 లక్షలు, ప్రత్యేక ఆఫర్ కింద మరో రూ. 15,000ల వరకు ఉంటాయి.

కంపాస్‌లో 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 170 హార్స్‌పవర్ శక్తిని, 350 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. జీప్ కంపాస్ ధర రూ. 18.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 32.41 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

అలాగే జీప్ మెరిడియన్ ఎస్‌యూవీపై ఈ జూన్‌లో అత్యంత భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ మోడల్‌పై కంపెనీ మొత్తం రూ. 3.90 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. దీని వివరాలు.. కన్స్యూమర్ ఆఫర్ కింద రూ. 2.30 లక్షలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 1.30 లక్షలు, స్పెషల్ బెనిఫిట్ కింద రూ. 15,000ల వరకు ఉంటాయి.


మెరిడియన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.99 లక్షల నుండి రూ. 38.79 లక్షల వరకు ఉంటుంది. ఇందులో రెయిన్-సెన్సింగ్ వైపర్స్, రీక్లైనింగ్ సెకండ్-రో సీట్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

జీప్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన గ్రాండ్ చెరోకీ పై కూడా ఈ జూన్‌లో రూ. 3 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ కారు ప్రస్తుతం భారతదేశంలో కేవలం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 67.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ డిస్కౌంట్లు అన్నీ జూన్ 30, 2025 వరకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. అంతేకాకుండా, ఆఫర్లు డీలర్‌షిప్‌ను బట్టి కొద్దిగా మారవచ్చు.

Tags:    

Similar News