Upcoming Maruti Cars: జోరు పెంచుతున్న మారుతి.. త్వరలో నాలుగు కొత్త కార్లు లాంచ్..!
Upcoming Maruti Cars: మారుతి సుజుకి ఇండియా నంబర్ 1 కార్ల తయారీ కంపెనీ. సరసమైన ధరలకు కార్లను అమ్మడం ద్వారా ఇది గళ్లీ నుండి ఢిల్లీ వరకు చేరింది.
Upcoming Maruti Cars: జోరు పెంచుతున్న మారుతి.. త్వరలో నాలుగు కొత్త కార్లు లాంచ్..!
Upcoming Maruti Cars: మారుతి సుజుకి ఇండియా నంబర్ 1 కార్ల తయారీ కంపెనీ. సరసమైన ధరలకు కార్లను అమ్మడం ద్వారా ఇది గళ్లీ నుండి ఢిల్లీ వరకు చేరింది. ఇటీవల ముగిసిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించారు. ఈ కారు కొన్ని నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం వివిధ బ్రాండ్ న్యూ హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలు, ఎమ్‌పివిలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Maruti Suzuki Baleno
ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఈ కారును అప్‌గ్రేడ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కొత్త హ్యాచ్‌బ్యాక్‌లో హైబ్రిడ్ పెట్రోల్ + ఎలక్ట్రిక్ ఇంజన్లు ఉంటాయి. అలానే కొత్త ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సరికొత్త మారుతి సుజుకి బాలెనో కారు ధర రూ. 6.66 లక్షల నుండి రూ. 9.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీనికి పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఉంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది.
Maruti Suzuki Fronx
ఈ ఎస్‌యూవీ ఏప్రిల్ 2023లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. దీని ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా ఇది పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ కారునే అప్‌గ్రేడ్ చేసి విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త కారు 2026 లేదా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ధర కనిష్టంగా రూ.7.51 లక్షలు, గరిష్టంగా రూ.13.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్ప్లే వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
Maruti Suzuki YBD
ఈ ఎమ్‌పివిని 2026 లో అమ్మకానికి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 'YDB' అనేది ఈ కారు కోడ్ నేమ్. ఇది అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే 'సుజుకి స్పేసియా'కి సమానంగా ఉంటుంది. దీని ధర రూ. 6.5 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
Maruti Suzuki eWX
ఇది డెవలప్మెంట్‌లో ఉన్న ఒక చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. రాబోయే సంవత్సరాల్లో విడుదల కావచ్చని అంచనా. ఈ కారులో పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఉండచ్చు. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ. 10 లక్షల ఎక్స్‌షోరూమ్‌గా ఉంటుందని భావిస్తున్నారు.