Maruti Suzuki Jimny: జపాన్‌లో హిట్ట్ కొట్టేందుకు సిద్ధముతున్న ఇండియా మేడ్ జిమ్నీ
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ భారత మార్కెట్లో పెద్దగా హిట్ కాకపోవచ్చు కానీ ఈ వెహికిల్ చూసిన వారు మాత్రం దీనిని ఒక గొప్ప ఎస్‌యూవీ అనే కితాబిస్తారు.
Maruti Suzuki Jimny: జపాన్‌లో హిట్ట్ కొట్టేందుకు సిద్ధముతున్న ఇండియా మేడ్ జిమ్నీ
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ భారత మార్కెట్లో పెద్దగా హిట్ కాకపోవచ్చు కానీ ఈ వెహికిల్ చూసిన వారు మాత్రం దీనిని ఒక గొప్ప ఎస్‌యూవీ అనే కితాబిస్తారు. ఈ కారు ఫెయిల్ అవడానికి కారణం కాంపాక్ట్ సైజ్, హై ప్రైస్. కంపెనీ ఈ వాహనాన్ని తక్కువ ధరకు లాంచ్ చేస్తే హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మారుతి 5 డోర్ల జిమ్నీని త్వరలోనే జపాన్‌లో విడుదల చేయనుంది. అయితే మేడ్ ఇన్ ఇండియా మోడల్‌ను జపాన్‌లో విక్రయించడం ఇందులో ఉన్న చెప్పుకోదగిన ప్రత్యేకతగా ఇండస్ట్రీ వర్గాలు చూస్తున్నాయి. జిమ్నీ 5 డోర్ వేరియంట్ దేశీయ రోడ్లపైకి కూడా త్వరలోనే వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం.. 5 డోర్ జిమ్నీ త్వరలో జపాన్‌లో విడులవుతుంది. ఈ కారును ఇండియాలో తయారుచేస్తారు. జపాన్‌లో విడుదల కానున్న జిమ్నీకి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోల్లో జిమ్నీ రెడ్, బ్లాక్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో కనిపిస్తుంది. జిమ్నీకి ముందు మారుతి గత సంవత్సరం జపాన్‌లో ఫ్రాంక్స్‌ను కూడా లాంచ్ చేసింది.
జిమ్నీ ఇంజన్ విషయానికొస్తే... కారులో 1.5 లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో వస్తుంది. ఇంజన్ 105Bhp పవర్, 134Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ మాన్యువల్ వెర్షన్ 16.94 KMPL, ఆటోమేటిక్ మోడల్ 16.39 KMPL మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
జిమ్నీ ఫీచర్ల విషయానికి వస్తే కారులో 9.0 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ ఇస్తుంది. వీటితో పాటుగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు.