Maruti Suzuki Fronx: దేశంలో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ.. ఈ టాప్ ఫీచర్లు కచ్చితంగా తెలుసుకోవాలి
Maruti Suzuki Fronx features: మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఫీచర్ల విషయానికొస్తే, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
దేశంలో టాప్ సెల్లింగ్ SUV.. ఈ టాప్ ఫీచర్లు కచ్చితంగా తెలుసుకోవాలి
Maruti Suzuki Fronx: మారుతీ సుజుకి ఫ్రాంక్స్ భారతీయ మార్కెట్లో కంపెనీకి చెందిన అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. దీని డిజైన్, ఫీచర్లు రెండూ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే ఈ ఎస్‌యూవీ అనేక వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. దాని కొన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటే.. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ Zeta Turbo AT
మారుతి సుజుకి ఫ్రాంక్స్ జెటా టర్బో AT ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.96 లక్షలు. ఇది లీటరుకు 20.01 కిమీల వరకు మైలేజీని ఇస్తుంది. ఇందులో 998సీసీ ఇంజన్ ఉంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 5500ఆర్‌పిఎమ్ వద్ద 98.69బిహెచ్‌పి పవర్, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 147.6ఎన్ఎమ్ పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది.
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ Alpha Turbo AT
మారుతి ఫ్రాంక్స్ ఆల్ఫా టర్బో ఎటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.88 లక్షలు. ఇది 998cc ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది పైన పేర్కొన్న వేరియంట్‌లానే అదే అవుట్‌పుట్‌ను ఇస్తుంది.
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ AT
మారుతి ఫ్రాంక్స్ ఆల్ఫా టర్బో డిటి ఎటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.04 లక్షలు. అదే సమయంలో ఇది పైన పేర్కొన్న వేరియంట్‌ల మాదిరిగానే ఇంజిన్, మైలేజీని కూడా కలిగి ఉంది.
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ AT Features
పైన పేర్కొన్న మూడు వేరియంట్లలో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), పవర్ అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రియర్ వ్యూ మిర్రర్, టచ్‌స్క్రీన్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పవర్ విండోస్ రియర్, పవర్ విండోస్ ఫ్రంట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఫీచర్ల విషయానికొస్తే, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ AT వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి సేఫ్టీ ఫీచర్లు అందించారు.
మారుతి సుజుకి అన్ని ఆటోమేటిక్ వేరియంట్‌లు 10 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆర్కిటిక్ వైట్, బ్లాక్ రూఫ్ ఓపులెంట్ రెడ్, బ్లాక్ రూఫ్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్, ఎర్టెన్ బ్రౌన్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, గ్రాండియర్ గ్రే, ఎర్టెన్ బ్రౌన్, బ్లూయిష్ బ్లాక్, నెక్సా బ్లూ,స్ప్లెండిడ్ సిల్వర్ ఉన్నాయి.