Maruti Suzuki e Vitara: సమయం ఆసన్నమైంది.. ఈ విటారా లాంచ్ డేట్ వచ్చేసింది.. ఫీచర్లు కిర్రాక్..!
Maruti Suzuki e Vitara: భారతీయులు మారుతి సుజుకి ఈ విటారా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిని ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించారు.
Maruti Suzuki e Vitara: సమయం ఆసన్నమైంది.. ఈ విటారా లాంచ్ డేట్ వచ్చేసింది.. ఫీచర్లు కిర్రాక్..!
Maruti Suzuki e Vitara: భారతీయులు మారుతి సుజుకి ఈ విటారా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిని ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించారు. ఇటీవల మారుతి సుజుకి కొత్త ఈ-విటారా సెప్టెంబర్ 2025 చివరి నాటికి దేశంలో విడుదల అవుతందని ధృవీకరించింది. ఈ ఎస్‌యూవీతో పాటు, కంపెనీ మరో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయనుంది.
Maruti Suzuki e Vitara Bookings
ఎలక్ట్రిక్ విటారా కాంపాక్ట్ సైజు, పెద్ద స్థలం దాని ప్లస్ పాయింట్లు. ఇది సిటీ, హైవేలపై మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. నివేదికల ప్రకారం.. కొన్ని డీలర్‌షిప్‌లలో దాని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కారును రూ. 25,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకుంటున్నారు. కానీ ఈ బుకింగ్ గురించి మారుతి సుజుకి నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు.
Maruti Suzuki e Vitara Measurements
కొలతలు గురించి మాట్లాడుకుంటే, కొత్త ఈ విటారా 180మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. దీని పొడవు 4,275మి.మీ, వెడల్పు 1,800మి.మీ, ఎత్తు 1,635మి.మీ, వీల్‌బేస్ 2,700మి.మీ. R18 ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కొత్త ఈ-విటారా నెక్సా బ్లూ, గ్రే, సిల్వర్, వైట్, రెడ్, బ్లాక్ సింగిల్-టోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
Maruti Suzuki e Vitara Range
కొత్త మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విటారా రెండు బ్యాటరీ ప్యాక్స్‌లో లభిస్తుంది - 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఇవి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ-విటారా గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. జపాన్, యూరప్‌లకు ఎగుమతి చేయనున్నారు. నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తారు. సేఫ్టీ కోం ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 అడాస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్, డిస్ట్రిబ్యూషన్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటాయి.
Maruti Suzuki e Vitara Price
నివేదికల ప్రకారం.. దీని ధర రూ. 16.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. భారతదేశంలో, ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో పోటీ పడనుంది. ఎలక్ట్రిక్ విటారా ఎంత విజయాన్ని సాధిస్తుందో చూడాలి.