Maruti Invicto: భారీ డిస్కౌంట్.. మారుతి సుజికి ఇన్విక్టో.. బడ్జెట్ ఫ్యామిలీ కార్..!

మారుతి సుజుకి ఇండియా జూలైలో తన అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఎంపీవీ ఇన్విక్టోపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.1.40 లక్షల తగ్గింపును ఇస్తోంది.

Update: 2025-07-13 17:29 GMT

Maruti Invicto: భారీ డిస్కౌంట్.. మారుతి సుజికి ఇన్విక్టో.. బడ్జెట్ ఫ్యామిలీ కార్..!

Maruti Invicto: మారుతి సుజుకి ఇండియా జూలైలో తన అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఎంపీవీ ఇన్విక్టోపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.1.40 లక్షల తగ్గింపును ఇస్తోంది. ఈ కారు రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. రెండూ 186 hp పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఉంటాయి. ఇన్విక్టో టాప్-స్పెక్ ఆల్ఫా+ ట్రిమ్‌పై మొత్తం రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. 7-సీటర్, 8-సీటర్ లేఅవుట్‌లలో లభించే జీటా+ ట్రిమ్‌పై రూ. 1.15 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇన్విక్టో ప్రస్తుత ధరలు రూ. 25.51 లక్షల నుండి రూ. 29.22 లక్షల మధ్య ఉన్నాయి.

Maruti Invicto Features And Specifications

మారుతి ఇన్విక్టోలో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 2.0-లీటర్ TNGA ఇంజిన్ ఉంటుంది. ఇది E-CVT గేర్‌బాక్స్‌కి జతచేసి ఉంటుంది. ఇది 183 బిహెచ్‌పి పవర్, 1250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 9.5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో ఒక లీటరు పెట్రోల్‌తో దీని మైలేజ్ 23.24 కి.మీ. వరకు ఉంటుంది. టయోటా ఇన్నోవా లాగానే, ఇది కూడా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లో వస్తుంది.

ఇందులో కండరాలతో కూడిన క్లామ్‌షెల్ బానెట్, డీఆర్‌లతో కూడిన సొగసైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, క్రోమ్‌తో చుట్టుముట్టిన షట్కోణ గ్రిల్, విశాలమైన ఎయిర్ డ్యామ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. క్యాబిన్‌లో డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, లెదర్ అప్హోల్స్టరీతో కూడిన పవర్డ్ ఒట్టోమన్ సీట్లు, ఇంటిగ్రేటెడ్ మూడ్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

మారుతి సుజుకి ఇన్విక్టోకు వన్-టచ్ పవర్ టెయిల్‌గేట్ లభిస్తుంది. అంటే టెయిల్‌గేట్ ఒక్క టచ్‌తో తెరుచుకుంటుంది. ఇది కంపెనీ తదుపరి తరం సుజుకి కనెక్ట్‌తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల భద్రతను కలిగి ఉంటుంది. దీని పొడవు 4755మి.మీ, వెడల్పు 1850మి.మీ. ఎత్తు 1795మి.మీ. దీనిలో 8 విధాలుగా సర్దుబాటు చేయగల పవర్ వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి . ఇందులో ముందు సీట్లు, రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు, సైడ్ ఫోల్డబుల్ టేబుళ్లు, మూడవ వరుసకు సులభంగా యాక్సెస్ కోసం వన్-టచ్ వాక్-ఇన్ స్లయిడ్, మల్టీ-జోన్ ఉష్ణోగ్రత సెట్టింగ్‌లు ఉన్నాయి.

Tags:    

Similar News