Safest Car: భద్రత ముఖ్యం.. బడ్జెట్ ధరలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న  కార్ ఇదే..!

Safest Car: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు తన కార్ల భద్రతపై మరింత దృష్టి పెడుతోంది.

Update: 2025-02-10 16:00 GMT

Safest Car: భద్రత ముఖ్యం.. బడ్జెట్ ధరలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న  కార్ ఇదే..!

Safest Car: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు తన కార్ల భద్రతపై మరింత దృష్టి పెడుతోంది. ఈ కంపెనీ తయారు చేస్తున్న కార్లలో స్టాండర్డ్ ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు సెలెరియో బేస్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా చేర్చింది. మీకు ఇష్టమైన ఈ మారుతి కారు ఇప్పుడు సురక్షితంగా మారింది. ఈ కారు ధర,  ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు పెట్రోల్, సిఎన్‌జిలో అందుబాటులో ఉంది. భద్రత కోసం సెలెరియోలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్,  ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ కారులో 5 మంది కూర్చునే స్థలం ఉంది.

మారుతి సెలెరియోలో 1.0 లీటర్ K10C పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 65hp పవర్,  89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజన్ దాని సెగ్మెంట్లో అత్యధిక మైలేజీని అందిస్తుంది. ఈ కారు ఒక లీటరులో 26కిమీల మైలేజీని ఇస్తుంది. CNG మోడ్‌లో ఈ కారు 33.85 km/kg మైలేజీని ఇస్తుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి సుజుకి మార్కెట్‌లో సెలెరియో  ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. అంతేకాకుండా మారుతి తన కార్లలో డ్యూయల్ CNG సిలిండర్లను ఉపయోగించవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News