Maruti Baleno: సేఫ్టీ రేటింగ్ విషయంలో నిరాశ పరిచిన మారుతి బాలెనో.. ఇంతకీ ఎంత స్కోర్ వచ్చిందంటే ?

Maruti Baleno: లో మెయింటెనెన్స్ ఖర్చు, మంచి రీసేల్ వ్యాల్యూ ఉండడం వల్ల మారుతి సుజుకి కార్లు బాగా అమ్ముడవుతాయి. కానీ సేఫ్టీ విషయంలో ఈ కార్ల పని తీరు ఎలా ఉంది ? తాజాగా, భారత్ NCAP మారుతి సుజుకికి చెందిన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనోను క్రాష్ టెస్ట్ చేసింది.

Update: 2025-06-12 14:00 GMT

Maruti Baleno: సేఫ్టీ రేటింగ్ విషయంలో నిరాశ పరిచిన మారుతి బాలెనో.. ఇంతకీ ఎంత స్కోర్ వచ్చిందంటే ?

Maruti Baleno: లో మెయింటెనెన్స్ ఖర్చు, మంచి రీసేల్ వ్యాల్యూ ఉండడం వల్ల మారుతి సుజుకి కార్లు బాగా అమ్ముడవుతాయి. కానీ సేఫ్టీ విషయంలో ఈ కార్ల పని తీరు ఎలా ఉంది ? తాజాగా, భారత్ NCAP మారుతి సుజుకికి చెందిన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనోను క్రాష్ టెస్ట్ చేసింది. ఈ టెస్టుల ఫలితాలు బాలెనో అభిమానులను నిరాశపరిచాయి. క్రాష్ టెస్ట్ సమయంలో మారుతి సుజుకికి చెందిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుకు 5 స్టార్ రేటింగ్ సంగతి అటుంచితే, పిల్లల భద్రత (చైల్డ్ సేఫ్టీ) విషయంలో కనీసం 4 స్టార్ రేటింగ్ కూడా రాలేదు. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారుకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. కానీ చైల్డ్ సేఫ్టీ విషయంలో కేవలం 3 స్టార్ రేటింగ్ మాత్రమే రావడంతో చాలా మంది నిరాశ చెందారు.

భారత్ NCAP బాలెనో 6 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్‌ను, 2 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్‌ను రెండింటినీ పరీక్షించింది. ఈ రెండు మోడల్స్ కూడా అడల్ట్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ వేరియంట్లలో వేర్వేరు స్కోర్లను సాధించాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్లో పెద్దల భద్రతలో 32 పాయింట్లకు గాను 26.52 పాయింట్లు సాధించింది. 2 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్లో పెద్దల భద్రతలో 32 పాయింట్లకు గాను 24.02 పాయింట్లు సాధించింది. పిల్లల భద్రత విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్, 2 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్ రెండింటికీ ఒకే స్కోరు వచ్చింది. ఈ రెండు మోడల్స్ కూడా 49 పాయింట్లకు గాను 34.81 పాయింట్లు సాధించాయి.

ఫ్రంటల్ ఆఫ్సెట్ బారియర్ టెస్టులో రెండు మోడల్స్ కూడా 16 పాయింట్లకు గాను 11.54 పాయింట్లు సాధించాయి. సైడ్ మూవబుల్ బారియర్ టెస్టులో 6 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్ 16 పాయింట్లకు 12.50 పాయింట్లు, 2 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్ 16 పాయింట్లకు 14.99 పాయింట్లు సాధించాయి.

బాలెనో మోడల్‌లో హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, ABSతో పాటు EBD, స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాకింగ్, హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, సెన్సార్లు, 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ, క్రాష్ టెస్ట్ లో అంతగా రాణించకపోవడం గమనార్హం.

మారుతి సుజుకి బాలెనో కారు ప్రారంభ ధర రూ. 6.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారులో టాప్ వేరియంట్ కొనాలంటే రూ. 9.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్నప్పటికీ మారుతి బ్రాండ్ పై ఉన్న నమ్మకం, లో మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి రీసేల్ వాల్యూ వంటి కారణాలతో ఈ కారు ఇంకా మార్కెట్లో బాగానే అమ్ముడవుతోంది.

Tags:    

Similar News