Maruti Best Selling Car: మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!

Maruti Best Selling Car: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్.

Update: 2025-02-24 05:42 GMT

Maruti Best Selling Car: మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!

Maruti Best Selling Car: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్. సరసమైన ధర, అధిక మైలేజీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ప్రజలు ఈ కారును సంవత్సరాలుగా రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతుంది. అమ్మకాల నుండి మీరు ఈ వాహనం డిమాండ్ అంచనా వేయచ్చు. FY2025 మొదటి 10 నెలల్లో మారుతి వ్యాగన్ఆర్‌ను 1,60,000 కంటే ఎక్కువ మంది కొత్త కస్టమర్‌లు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 2024, జనవరి 2025 మధ్య వ్యాగన్ఆర్ మొత్తం దేశీయ అమ్మకాలు 1,61,397 యూనిట్లు. గత నెలలో అంటే జనవరి 2025లో మారుతి వ్యాగన్ఆర్ కూడా దేశంలో నంబర్-1 కారుగా అవతరించింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లను ఒకసారి పరిశీలిద్దాం.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ని LXI, VXI, ZXI వంటి అనేక వేరియంట్‌లలో కొనచ్చు. దేశీయ మార్కెట్లో వ్యాగన్ ఆర్ ప్రారంభ ధర రూ.5.64 లక్షలు ఎక్స్-షోరూమ్. కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.47 లక్షలు ఎక్స్-షోరూమ్. పెట్రోల్, సీఎన్‌జీ ఎంపికలలో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరొక 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఈ సీఎన్‌జీ మోడల్‌లో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ పవర్ అవుట్‌పుట్ 57 పీఎస్, 82 ఎన్ఎమ్. దీనితో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందించారు. ఈ కారు విపరీతమైన మైలేజీకి ప్రసిద్ధి చెందింది.

మారుతి వ్యాగన్ఆర్ పెట్రోల్ మోడల్ లీటరుకు 23.56 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. CNG మోడల్ కిలోగ్రాముకు 34.05 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. 170ఎమ్ఎమ్ అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది.

ఈ హ్యాచ్‌బ్యాక్ 341-లీటర్ల భారీ బూట్ స్పేస్‌ ఉంది. అంతే కాకుండా 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు,ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇంటీరియర్‌లో అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News