MG Windsor EV: మనసులు దోచేస్తున్నాయ్.. ఆరు నెలల్లో రికార్డ్ సేల్స్.. ఏమి కొంటున్నారు సామీ..!
MG Windsor EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ నిరంతరం వేగంగా పెరుగుతోంది. కొత్త మోడళ్ల రాకతో, కస్టమర్లకు ఎంపికలకు కొరత ఉండదు.
MG Windsor EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ నిరంతరం వేగంగా పెరుగుతోంది. కొత్త మోడళ్ల రాకతో, కస్టమర్లకు ఎంపికలకు కొరత ఉండదు. ఇప్పుడు మీరు ప్రతి బడ్జెట్, రేంజ్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్లను సులభంగా పొందచ్చు. ప్రస్తుతం ఎంజీ విండ్సర్ ఈవీని వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు గత 6 నెలలుగా కస్టమర్ల నుండి చాలా ప్రేమను పొందుతుంది. 6 నెలల్లో 20,000 యూనిట్ల విండ్సర్ ఈవీ అమ్ముడయ్యాయని ఎంజీ తెలిపింది. ఇది కంపెనీకి ఒక పెద్ద విజయం.
MG Windsor EV Prie And Offers
ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కానీ, బ్యాటరీ ధర ఇందులో లేదు. ఎంజీ మోటర్స్ తన ఈవీల కోసం BaaS ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చింది. దీని ద్వారా, వినియోగదారులు బ్యాటరీని విడిగా అద్దెకు తీసుకోవచ్చు. దీనికి మీరు కిలోమీటరుకు రూ. 3.50 చెల్లించాలి. ధర పరంగా ఈ ఎస్‌యూవీ మెరుగైన ఎంపిక. ఈ కారు దాని డిజైన్, పరిధి, స్థలం ,ధర ఆధారంగా వినియోగదారులను ఆకర్షిస్తోంది.
MG Windsor EV Range
బ్యాటరీ, రేంజ్ గురించి మాట్లాడుకుంటే.. ఎంజీ విండ్సర్ ఈవీలో 38కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 45kW డీసీ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ సహాయంతో బ్యాటరీ కేవలం 55 నిమిషాల్లో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
MG Windsor EV Range Features And Specifications
విండ్సర్ ఈవీ సీట్లు, స్థలం దాని ప్లస్ పాయింట్లు. ఈ కారులో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, దీనితో పాటు, ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. భద్రత కోసం, ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్టిబ్యూషన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.