Hyundai Venue: మారుతి బ్రెజాకు పోటీ.. హ్యుందాయ్ వెన్యూ మీద బంఫర్ డిస్కౌంట్
Hyundai Venue: హ్యుందాయ్ మోటార్ ఇండియా మనదేశంలో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీల్లో ఒకటి. హ్యుందాయ్ చిన్న కార్ల నుండి SUVల వరకు అనేక రకాల మోడళ్లను అమ్ముతోంది.
Hyundai Venue: మారుతి బ్రెజాకు పోటీ.. హ్యుందాయ్ వెన్యూ మీద బంఫర్ డిస్కౌంట్
Hyundai Venue: హ్యుందాయ్ మోటార్ ఇండియా మనదేశంలో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీల్లో ఒకటి. హ్యుందాయ్ చిన్న కార్ల నుండి SUVల వరకు అనేక రకాల మోడళ్లను అమ్ముతోంది. వాటిలో ఒక SUV అయిన వెన్యూ, భారతీయ మార్కెట్‌లో మారుతి బ్రెజాకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం హ్యుందాయ్ తన సబ్ కాంపాక్ట్ SUV వెన్యూపై ఏకంగా 75,000 రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
హ్యుందాయ్ వెన్యూ ధర
హ్యుందాయ్ వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర బేస్ మోడల్ 1.2 పెట్రోల్ కోసం రూ.7.94 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ కోసం రూ.13.62 లక్షల వరకు ఉంటుంది. వెన్యూ మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 82 bhp పవర్, 114 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది, ఇది 118 bhp పవర్, 172 nm టార్క్‌ను అందిస్తుంది. 1.2-లీటర్ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, అయితే టర్బో ఇంజన్‌ను ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఏడు-స్పీడ్ DCTతో జతచేయవచ్చు. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 113 bhp పవర్, 250 nm టార్క్‌ను ఇస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు
హ్యుందాయ్ వెన్యూలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రివర్సింగ్ కెమెరా, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటుతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ABSతో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. వెన్యూలో స్టోరేజ్‌తో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఫ్రంట్, రియర్ USB ఛార్జర్‌లు, బ్లూలింక్ కనెక్టివిటీ సిస్టమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ వెన్యూలో సేఫ్టీ
హ్యుందాయ్ వెన్యూ బాహ్య ఫీచర్లలో డార్క్ క్రోమ్ గ్రిల్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ల్యాంప్‌లు, కనెక్టింగ్ LED టెయిల్ ల్యాంప్‌లు, క్రోమ్ డోర్ హ్యాండిల్‌లు, రూఫ్ రెయిల్‌లు ఉన్నాయి. ఇందులో 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. వెన్యూలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.