2025 Honda Hornet 2.0 launched: హోండా హార్నెట్ 2.0 లాంచ్.. ఈసారి సరికొత్తగా వచ్చేసింది..!

2025 Honda Hornet 2.0 launched:హోండా మోటార్‌సైకిల్ తన ఫేమస్ స్ట్రీట్‌ఫైటర్ 2025 హోండా హార్నెట్ 2.0ని కొత్త అప్‌డేట్‌లతో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.57 లక్షలు.

Update: 2025-02-21 10:00 GMT

2025 Honda Hornet 2.0 launched: హోండా హార్నెట్ 2.0 లాంచ్.. ఈసారి సరికొత్తగా వచ్చేసింది..!

2025 Honda Hornet 2.0 launched:హోండా మోటార్‌సైకిల్ తన ఫేమస్ స్ట్రీట్‌ఫైటర్ 2025 హోండా హార్నెట్ 2.0ని కొత్త అప్‌డేట్‌లతో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.57 లక్షలు. ఈ ధర మునుపటి మోడల్ కంటే రూ.14,000 ఎక్కువ. ఈ పెరిగిన ధరతో బైక్‌లో అనేక కొత్త ఫీచర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు చూడొచ్చు. బైక్ ఇంజన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

ఈ మోటార్‌సైకిల్‌లో 4.2-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లేతో బ్లూటూత్ కనెక్ట్, నావిగేషన్, కాల్ అలర్ట్‌, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు ఈ బైక్‌లో హోండా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది రైడింగ్‌ను మరింత సురక్షితంగా చేస్తుంది. కొత్తగా USB-C పోర్ట్ కూడా చేర్చారు. మీరు ప్రయాణంలో ఛార్జింగ్ చేయచ్చు.

2025 హోండా హార్నెట్ 2.0లో 184cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది ఈ ఇంజన్ 16.7బీహెచ్‌పి పవర్, 15.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌ను OBD2B-నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేశారు. బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. హోండా ఈ మోటార్‌సైకిల్ బాడీవర్క్‌లో పెద్దగా మార్పులు చేయలేదు, అయితే కొత్త గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్‌లు జోడించారు.

2025 హోండా హార్నెట్ కొత్త TFT స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB-C ఛార్జింగ్ పోర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS భద్రతను మెరుగుపరుస్తాయి. స్పోర్టీ లుక్, కొత్త గ్రాఫిక్స్ బైైక్‌ను మరింత అద్భుతంగా చేస్తాయి. ఇప్పుడు పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ వేరియంట్లను కొత్తగా ఉన్నాయి.

Tags:    

Similar News