Honda New Bikes: కొత్త రంగు, అదిరే ఫీచర్లతో హోండా.. మూడు వేరియంట్లలో వచ్చాయ్..!
Honda New Bikes: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన 2025 CB350 సిరీస్‌లో CB350, CB350 H'ness,CB350RS మోడల్‌లకు కొత్త కలర్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది.
Honda New Bikes: కొత్త రంగు, అదిరే ఫీచర్లతో హోండా.. మూడు వేరియంట్లలో వచ్చాయ్..!
Honda New Bikes:
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన 2025 CB350 సిరీస్‌లో CB350, CB350 H'ness,CB350RS మోడల్‌లకు కొత్త కలర్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. మూడు మోటార్‌సైకిళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. CB350 లైనప్‌లోని అన్ని మోడల్‌లు ఒకే 348.36సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తాయి. ఈ ఇంజన్ 20.78 బిహెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. అలానే 5 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్‌తో జతై ఉంటాయి. ఇది గేర్‌షిఫ్టింగ్‌ను సున్నితంగా చేస్తుంది.
1. Honda CB350
స్టాండర్డ్ హోండా CB350 ఇప్పుడు మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మాట్ డ్యూన్ బ్రౌన్, రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే వంటి ఐదు కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ బైక్ రెండు వేరియంట్‌లలో అందించారు-DLX ధర రూ. 2.15 లక్షలు. DLX ప్రో ధర రూ. 2.19 లక్షల ఎక్స్-షోరూమ్.
2. Honda CB350 Hiness
CB350 హెచ్‌నెస్ ఇప్పుడు మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఇవి విభిన్న రంగు ఎంపికలతో వస్తాయి. బేస్ మోడల్ DLX ధర రూ. 2.11 లక్షలు, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. DLX ప్రో వేరియంట్ ధర రూ. 2.14 లక్షలు. రెబెల్ రెడ్ మెటాలిక్, పెరల్ ఇగ్నియస్ బ్లాక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అత్యంత ప్రీమియం మోడల్, DLX క్రోమ్ ధర రూ. 2.16 లక్షలు, ఇది అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే ,పెరల్ ఇగ్నియస్ బ్లాక్ వంటి షైనింగ్ కలర్స్‌లో లభిస్తుంది.
3. Honda CB350RS
CB350RS రెండు వేరియంట్లలో ఉంది. ఇది ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌తో వస్తుంది. బేస్ మోడల్ DLX ధర రూ. 2.16 లక్షల ఎక్స్-షోరూమ్. పెరల్ ఇగ్నియస్ బ్లాక్ మరియు పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది. అదే సమయంలో దాని ప్రీమియం వేరియంట్ DLX ప్రో రూ. 2.19 లక్షల ధరతో, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి బోల్డ్, స్టైలిష్ కలర్ ఆప్షన్‌లతో వస్తుంది.