Hero Xoom 125: అదిరిపోయే ఫీచర్స్‌‌తో హీరో కొత్త స్కూటర్.. ధర ఇంత తక్కువా..?

Hero Xoom 125: హీరోమోటోకార్ప్ ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన అత్యంత స్టైలిష్ స్కూటర్ 'Hero Xoom 125'ని పరిచయం చేసింది.

Update: 2025-03-11 00:30 GMT

Hero Xoom 125: అదిరిపోయే ఫీచర్స్‌‌తో హీరో కొత్త స్కూటర్.. ధర ఇంత తక్కువా..?

Hero Xoom 125: హీరోమోటోకార్ప్ ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన అత్యంత స్టైలిష్ స్కూటర్ 'Hero Xoom 125'ని పరిచయం చేసింది. స్కూటర్ ధర రూ.86,900 నుంచి ప్రారంభమవుతుంది. యువత, కుటుంబ వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ రూపొందించింది. ప్రస్తుతం ఈ స్కూటర్ టెస్ట్ రైడ్ జరుగుతోంది. కొత్త జూమ్ 125లో అనేక ఫీచర్లు ఉన్నాయి. రండి.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హీరో కొత్త జూమ్ 125 మొదటి చూపులోనే దాని డిజైన్‌తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు హీరో నుండి వచ్చిన బెస్ట్ లుకింగ్ స్కూటర్ కూడా ఇదే. యువతతో పాటు కుటుంబ వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించారు. దాని పెద్ద చక్రాల కారణంగా రైడ్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

Hero Xoom 125 Features

హీరో మోటోకార్ప్ కొత్త జూమ్ 125లో చాలా మంచి ఫీచర్లను చూడచ్చు. ఇందులో డిజిటల్ డిస్‌ప్లే ఉంది. దీనిలో కాల్స్, నోటిఫికేషన్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ కాకుండా, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ స్కూటర్‌కు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు అందించారు. ఖరీదైన లగ్జరీ కార్లలో ఇటువంటి ఫీచర్లు కనిపిస్తాయి.

Hero Xoom 125 Engine

హీరో జూమ్‌లో 124.6సీసీ ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్, ఎస్‌ఐ ఇంజన్ 9.8బిహెచ్‌పి పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌కు ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. దీని కారణంగా మెరుగైన మైలేజీతో పటిష్టమైన పనితీరు లభిస్తుంది. ఇది కాకుండా CVT గేర్‌బాక్స్ సదుపాయాన్ని అందించారు. జూమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఈ ఇంజన్ ప్రతి సీజన్‌లో మంచి పనితీరును అందిస్తుంది.

హీరో జూమ్‌ 125 ముందు, వెనుక 14-అంగుళాల పెద్ద, వెడల్పు గల టైర్లు ఉంటాయి, ఇవి రహదారిపై మంచి పట్టును అందిస్తాయి. స్కూటర్ పొడవు 1978మిమీ, వెడల్పు 739మిమీ/749మిమీ. స్కూటర్ ఎత్తు 1327మిమీ, అయితే సీట్ ఎత్తు 777మిమీ. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 164 మిమీ. స్కూటర్ బరువు 120/121 కిలోలు. స్కూటర్‌లో 5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది.

Hero Xoom 125 Price

కొత్త జూమ్ 125 నాలుగు రంగులు, రెండు వేరియంట్లలో అందుబాటులో ఉందిజూమ్ ZX ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,900 అయితే జూమ్ ZX ఎక్స్-షోరూమ్ ధర రూ. 92,900. ఈ రెండింటి మధ్య ఫీచర్లలో తేడా ఉంది.

Tags:    

Similar News