Two Wheeler EMIs: కేవలం 3 వేల ఈఎమ్‌ఐ.. ఈ బైక్ కొనొచ్చు.. ఆ బైక్‌లకు గట్టి పోటీ..!
Two Wheeler Bike EMI Plans: మీరు చవకైన, మంచి కంపెనీ బైక్ కోసం చూస్తున్నారా, అయితే Hero Passion Plus మీకు మంచి ఛాయిస్ కావచ్చు.
Two Wheeler EMIs: కేవలం 3 వేల ఈఎమ్‌ఐ.. ఈ బైక్ కొనొచ్చు.. ఆ బైక్‌లకు గట్టి పోటీ..!
Two Wheeler Bike EMI Plans: మీరు చవకైన, మంచి కంపెనీ బైక్ కోసం చూస్తున్నారా, అయితే Hero Passion Plus మీకు మంచి ఛాయిస్ కావచ్చు. GST తగ్గింపు తర్వాత హీరో కంపెనీ ఈ బైక్ ధరను తగ్గించింది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించనుంది. బైక్ కొనడానికి మీ వద్ద లక్ష రూపాయలు లేవని బాధ పడవద్దు. ఎక్కువ నగదు మీతో లేకపోయినా మీరు కేవలం 5 వేల రూపాయల డౌన్ పేమెంట్ తో బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ఆన్-రోడ్ ధర, EMI లెక్కల గురించి తెలుసుకుందాం.
ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ.76 వేల 691. దీని ఆన్-రోడ్ ధరలో RTO, ఇన్సూరెన్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నగదు 91 వేల 383 రూపాయలు చెల్లించాలి. ఈ ఆన్-రోడ్ ధర ఆయా నగరాలు, డీలర్‌షిప్ ఆధారంగా వ్యత్యాసం ఉండవచ్చు. Hero Passion Plus బైకును మీరు 5,000 రూపాయల డౌన్ పేమెంట్ చేయగలిగితే సొంతం చేసుకోవచ్చు. తరువాత 86,383 రూపాయల బైక్ లోన్ 10 శాతం వార్షిక వడ్డీ రేటుతో 3 ఏళ్లకు లభిస్తే, EMI దాదాపు రూ.3,119 చెల్లించాల్సి వస్తుంది.
ఈ బైక్‌లో 97.2 cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ OBD2B ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 7.91 bhp పవర్, 8.05 Nm టార్కును జనరేట్ చేస్తుంది. ఇది స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం 85 kmph. కాగా బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 11 లీటర్ల Fuel Tanks తో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే దాదాపు 750 కిమీ దూరం ప్రయాణించవచ్చు. రోజువారీ ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ మైలేజ్ బైకులలో ఒకటి.
ఈ హీరో బైక్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి రోజువారీ ఉపయోగం కోసం చాలా ఆచరణాత్మకమైనవి. ఇందులో i3S టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతా పరంగా చూస్తే.. ఫ్రంట్ వీల్, వెనుక చక్రాలపై 130mm డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఇవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS)తో వస్తాయి. ఈ బ్రేకింగ్ సిస్టమ్ బైకును మరింత సురక్షితంగా మార్చుతుంది.
ఈ బైక్ ముఖ్యంగా హోండా షైన్ 100 (Honda Shine 100) లాంటి 100cc సెగ్మెంట్ బైకులకు పోటీ ఇస్తుంది. అలాగే టీవీఎస్ రేడియన్ (TVS Radeon), బజాజ్ ప్లాటినా (Bajaj Platina) వంటి బైక్లతో పోటీపడుతుంది. ఇది చవకైన బైక్, మంచి ఇంధన సామర్థ్యం కలిగిన కమ్యూటర్ బైక్. మంచి మైలేజ్ ఇచ్చే బైకులలో ఒకటి కావడంతో పాటు ఇది సౌకర్యవంతమైన రైడ్ కోసం చూసే వారికి బెస్ట్ బైక్ ఆప్షన్ అని చెప్పవచ్చు.