Ola Electric Scooter: ఓలా స్కూటర్ యజమానులకి గుడ్‌న్యూస్‌.. కంపెనీ ఈ భాగాన్ని ఉచితంగా మారుస్తోంది..!

Ola Electric Scooter: భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధికంగా అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-03-15 12:45 GMT

Ola Electric Scooter: ఓలా స్కూటర్ యజమానులకి గుడ్‌న్యూస్‌.. కంపెనీ ఈ భాగాన్ని ఉచితంగా మారుస్తోంది..!

Ola Electric Scooter: భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధికంగా అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే. అయితే సదరు కంపెనీ ఇప్పుడు పెద్ద ప్రకటన చేసింది. Ola S1, Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు ఉచిత ఫ్రంట్ ఫోర్క్ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తోంది. వాస్తవానికి కంపెనీ ఫ్రంట్ ఫోర్క్ డిజైన్‌ను మార్చింది దానికి "అప్‌గ్రేడ్ ఫోర్క్" అని పేరు పెట్టింది. ఈ కొత్త డిజైన్ స్కూటర్‌ను మరింత దృఢంగా, మన్నికగా మారుస్తుందని సంస్థ తెలిపింది.

Ola S1, S1 ప్రో స్కూటర్ల యజమానికి ఈ అప్‌గ్రేడ్ పూర్తిగా ఉచితం. దీని కోసం అపాయింట్‌మెంట్ విండో మార్చి 22 నుంచి ఓపెన్‌ అవుతుంది. బుకింగ్ వివరణాత్మక ప్రక్రియను కంపెనీ త్వరలో తెలియజేస్తుంది. ఈ మేరకు కంపెనీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గుంతల గుండా వెళుతున్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు ఫోర్క్ పగిలిపోవడం చాలాసార్లు కనిపించింది. పలువురు స్కూటర్ యజమానులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కస్టమర్లు కంప్లెయింట్‌ చేయడం ప్రారంభించారు. స్పందించిన EV తయారీదారు సస్పెన్షన్ చక్రానికి కనెక్ట్ చేసే భాగాన్ని పెంచింది.

Ola S1 ఎయిర్ ముందు భాగంలో పాత-కాలపు టెలిస్కోపిక్ ఫోర్క్ ఉపయోగించారు. మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 500 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. కస్టమర్లు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత టెక్నీషియన్ వస్తారు. కంపెనీ ప్రస్తుతం బుకింగ్, చెల్లింపులను ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మీరు ఫ్రంట్ ఫోర్క్‌ను భర్తీ చేయాలనుకుంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. కస్టమర్‌లు సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లేదా సర్వీస్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.


Tags:    

Similar News