Top Selling Cars: మార్కెట్లో ఈ నాలుగే చౌకైన కార్లు.. కొనేందుకు జనాలు క్యూ కడుతున్నారు
Top Selling Cars: మార్కెట్లో ఈ నాలుగే చౌకైన కార్లు
Top Selling Cars: ఈ ఏడాది అనేక వాహన తయారీ కంపెనీలు సేల్స్‌లో అదరగొట్టాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ వాహనాలే కనిపిస్తున్నాయి. అంతలా.. వినియోగదారులను ఈ వాహనాలు ఆకట్టుకున్నాయి. అయితే ఈ నాలుగు వాహనాలు చాలా కాలంగా ఈ విభాగంలో దూసుకుపోతున్నాయి. ఈ కార్ల ధరలు తక్కువగా ఉండటమే కాకుండా, మంచి మైలేజీని కూడా ఇస్తాయి. ఇంతకీ ఆ జాబితాలో ఉన్న కార్లు ఏంటి, వాటి ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.
2025 బాలెనో
మారుతి బాలెనోలో అధునాతన ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ హైటెక్ 1.2 L K సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT యూనిట్, ఐడిల్ స్టార్ట్, స్టాప్ ఫీచర్స్ ఉన్నాయి. సిటీ రోడ్లపై మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు AMTలో బ్రేక్ లేదా MTలో క్లచ్‌ని నొక్కిన వెంటనే కారు ఆగి, రీస్టార్ట్ అయినప్పుడు ISS ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తుంది. కారు స్థిరమైన బ్రేకింగ్ పనితీరు కోసం అప్‌గ్రేడ్ చేసిన 14-అంగుళాల బ్రేక్ సిస్టమ్, వెనుక ప్రయాణికుల సౌకర్యం కోసం సరికొత్త అప్‌గ్రేడ్ చేసిన సస్పెన్షన్ సిస్టమ్ అందించారు. బాలెనోలో హైడ్రాలిక్ క్లచ్ సిస్టమ్ కూడా ఉంది. కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 8.44 లక్షలుగా ఉంది.
2025 మారుతి ఆల్టో K10
మారుతి సుజుకి ఆల్టో కె10లో 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 66 బిహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో ఉంటుంది. కంపెనీ ఈ కారులో CNG ఆప్షన్ కూడా అందిస్తుంది. ఆల్టో K10 STD (O) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4 లక్షలుగా ఉంది.
2025 టాటా టిగోర్
టాటా టియాగో పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్‌లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పెట్రోల్ మోడల్ 1.2-లీటర్, మూడు-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారులో మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఉంటుంది. టియాగో తన iCNG టెక్నాలజీ కూడా అందిస్తుంది. డ్యూయల్ సిలిండర్‌లతో వస్తుంది. ఇందులో కూడా అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించారు. ఈ ఇంజన్ 74 బిహెచ్‌పి పవర్, 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2025 టాటా టియాగో ధర రూ. 7.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్ మోడల్ లైనప్ 1.2L NA పెట్రోల్, 1.2L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ ఇంజన్లు 86బిహెచ్ , 110బిహెచ్‌పి పవర్ రిలీజ్ చేస్తాయి. అయితే డీజిల్ ఇంజన్ 90బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది, అయితే 6-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 1.2L NA పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.6.64 లక్షలు.