Best Bikes Under 1 Lakh: రూ.1 లక్ష బడ్జెట్‌లో చాలా రిచ్ లుక్ ఇచ్చే బెస్ట్ బైక్స్

Update: 2024-12-30 14:30 GMT

Best Bikes Under 1 Lakh: కొత్త సంవత్సరం అయినా లేదా ఏదైనా పండుగ అయినా, ప్రజలు ఆ సందర్భాన్ని ప్రత్యేకంగా, కొత్తగా జరుపుకోవాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా కొంతమంది ఏదైనా కొత్త వస్తువు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తుంటారు. భారతీయ మార్కెట్లో ఈ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు తగినట్లుగానే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో చాలామంది బైక్స్ కొనుగోలు చేయడం అనేది ఒక కామన్ ఆప్షన్‌గా కనిపిస్తుంటుంది. అందుకే లక్ష రూపాయల రేంజ్‌లో లభించే మోటార్‌సైకిల్స్ నుండి స్కూటర్ల వరకు ఏమేం ఆప్షన్స్ ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Hero Splendor Plus - హీరో స్ప్లెండర్ ప్లస్

హీరో స్ప్లెండర్ ప్లస్ భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌ సైకిళ్లలో ఒకటి. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.75,441 నుండి ప్రారంభమవుతుంది. ఈ హీరో బైక్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC ఇంజన్ కలదు. బైక్‌లో అమర్చిన ఈ ఇంజన్ 8,000 rpm వద్ద 5.9 kW పవర్‌, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Honda Activa - హోండా యాక్టివా

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ఈ ద్విచక్ర వాహనంలో 4-స్ట్రోక్, SI ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 8,000 rpm వద్ద 5.77 kW పవర్, 5,500 rpm వద్ద 8.90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 50 kmpl మైలేజీని ఇస్తుంది. మూడు రకాల యాక్టివాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ.76,684 నుండి మొదలై రూ.82,684 వరకు ఉంది. దేశంలోని ఇతర నగరాల్లో ఈ ధరలో తేడాలు ఉండవచ్చు.

TVS Raider - టీవీఎస్ రైడర్

TVS రైడర్ 125 అనేది గొప్ప, మోడర్న్ స్టైల్‌తో కూడిన బడ్జెట్-ఫ్రెండ్లీ బైక్. ఈ మోటార్‌సైకిల్‌ను ఆరు వేరియంట్‌లలో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఢిల్లీలో ఈ TVS ​​బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.98,530 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ కేవలం 5.8 సెకన్లలో 0 నుండి 60 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఈ ద్విచక్ర వాహనం ARAI మైలేజ్ 56.7 kmpl గా (ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సూచించే మైలేజ్) ఉంది.

TVS Jupiter - టీవీఎస్ జుపిటర్

టీవీఎస్ జూపిటర్ కూడా గొప్ప స్కూటర్. ఈ ద్విచక్ర వాహనానికి మార్కెట్‌లో చాలా క్రేజ్ ఉంది. ఈ TVS ​​స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,691 నుండి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ SXC, డిస్క్ SXC అనే నాలుగు వేరియంట్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. TVS జూపిటర్ ARAI మైలేజ్ 53 kmpl గా ఉంది.

Tags:    

Similar News