Best 200cc Bikes: మీకు 200 సీసీ బైక్ అంటే ఇష్టమా..? ది బెస్ట్ బైక్స్ ఇవే..!
Best 200cc Bikes: ఇప్పుడు ప్రజలు 200 సీసీ బైక్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా యువత ఈ సెగ్మెంట్ బైక్‌లను కొనడానికి ఆసక్తిచూపుతున్నారు.
Best 200cc Bikes: మీకు 200 సీసీ బైక్ అంటే ఇష్టమా..? ది బెస్ట్ బైక్స్ ఇవే..!
Best 200cc Bikes: ప్రస్తుత కాలంలో ద్విచక్ర వాహనాలు ప్రతి ఇంటికి అవసరంగా మారాయి. అలానే మరికొందరి జీవనాధారంగా కూడా. ఆటో మొబైల్ కంపెనీలు పెద్దలు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బైక్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. గతంలో 100 సీసీ ఇంజన్ బైక్‌ల హవా నడిస్తే.. ఇప్పుడు ప్రజలు 200 సీసీ బైక్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా యువత ఈ సెగ్మెంట్ బైక్‌లను కొనడానికి ఆసక్తిచూపుతున్నారు. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మందిలో అపోహ ఉంది. రూ.2 లక్షల బడ్జెట్‌లో 200సీసీ బైక్‌లు సందడి చేస్తున్నాయి. లేటెస్ట్ లుక్, మంచి పనితీరుతో ఆకట్టుకొనే బైక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1. TVS Apache RTR 200 4V
ఈ టీవీఎస్ బైక్ గొప్ప ఫీచర్లు, బలమైన మైలేజీతో వస్తుంది. బైక్‌లో 197.75 cc సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉంది. ఈ ఇంజన్ 20.2 బీహెచ్‌పి పవరక్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ 41.9 kmpl. ఈ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS, రెండు రైడింగ్ మోడ్స్, 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 152 కిలోల కర్బ్ వెయిట్ ఉన్నాయి. స్పోర్టీ లుక్స్, అధునాతన సాంకేతికత, ప్రత్యేకించి సరైన పవర్,మైలేజీని కోరుకునే రైడర్‌లకు అపాచీ బెస్ట్ ఆప్షన్ .
2. Bajaj Pulsar NS200
బజాజ్ నుండి ఈ పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ బైక్ శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన హ్యాండ్లింగ్‌కు ఫేమస్. ఈ బైక్ 199.5 cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇంజన్ 24.13 బీహెచ్‌పి పవర్,18.74 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 38 kmpl. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్, సింగిల్, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. 159.5 కిలోల కర్బ్ వెయిట్‌తో స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ లుక్‌లు యువతను ఆకర్షిస్తాయి.
3. Honda Hornet 2.0
హార్నెట్ హోండా స్పోర్టీ, స్టైలిష్ డిజైన్ బైక్, హార్నెట్ పెర్ఫార్మెన్స్, మైలేజ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. బైక్‌లో 184.4 cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 17.03 బీహెచ్‌పి పవర్, 15.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ 42.3 kmpl. బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్,సింగిల్-ఛానల్ ABS ఉన్నాయి. రైడింగ్ అనుభవాన్ని సురక్షితంగా, సాఫీగా చేస్తుంది. బైక్ కర్బ్ వెయిట్ 142 కిలోలు మాత్రమే.