Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ బజాజ్ ఫ్రీడమ్ బైక్‌పై రూ.10వేల తగ్గింపు.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు

Update: 2024-12-05 16:15 GMT

Bajaj Freedom 125: భారతీయ 2-వీలర్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే తొలి CNG బైక్‌గా గుర్తింపు పొందిన బజాజ్ ఫ్రీడమ్ 125కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ బైక్ బుకింగ్స్ కంపెనీ అంచనాలను మించిపోయాయి. ఇప్పుడు, ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 CNG డెలివరీలు వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. సరసమైన ధర, ఆకర్షణీయమైన డిజైన్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ మోటార్‌ సైకిల్ మంచి ప్రాధాన్యతగా కనిపిస్తోంది. సరసమైన ధర, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్, గొప్ప ఇంధన సామర్థ్యం బజాజ్ ఫ్రీడమ్ CNG బైక్ ప్లస్ పాయింట్లు. మీరు ఈ సీజన్‌లో కొత్త బైక్ కొనాలని చూస్తున్నట్లయితే.. బజాజ్ ఫ్రీడమ్ 125 మీ కోసమే అంటోంది బజాజ్ కంపెనీ. సంవత్సరం ముగిసిపోనుండటంతో కంపెనీ ఈయర్ ఎండింగ్ ఆఫర్‌ ప్రకటించింది. దీని కింద కంపెనీ ఈ బైక్‌పై రూ.10 వేల వరకు తగ్గింపును అందిస్తోంది.

మోడర్న్ డిజైన్

డిజైన్ పరంగా బజాజ్ ఫ్రీడమ్ 125 CNG ఇతర కమ్యూటర్ బైక్‌లకు భిన్నంగా ఉంటుంది. ఇది ప్రీమియం లుక్ అందించే ఆధునిక స్టైల్, డిజైన్‌తో వస్తోంది. ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్, ట్యాంక్ కవర్లు, హెక్సాగోనల్ ఫ్రంట్ ల్యాంప్ వంటి ఫీచర్లు బైక్‌కు ఆకర్షణీయంగా ఉంటాయి.

విశాలమైన సీటింగ్

CNG బైక్ సీటు సెగ్మెంట్‌లో పొడవైన వాటిలో ఒకటి. 785 MM కెపాసిటీ ఉన్న ఈ సీటులో రైడర్ బైక్‌పై కూర్చోవడానికి సరిపడా స్థలం ఉంటుంది. సిటీ వినియోగానికి సౌకర్యంగా ఉంటుంది.

డ్యూయల్ ఫ్యూయల్ ఆప్షన్స్

ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మోటార్‌సైకిల్‌లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి CNG కాగా మరొకటి పెట్రోల్ వేరియంట్. CNG ట్యాంక్ 2 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ 2 లీటర్ల వరకు కూడా నింపవచ్చు. బజాజ్ పేర్కొన్నట్లుగా ఈ బైక్ మొత్తం 300 కి.మీ రేంజ్ అందిస్తోంది.

టెక్నాలజీ

ఈ CNG బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ కాల్ అలర్ట్‌లతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌లు, బ్యాటరీ లైఫ్ ఇండికేటర్ , LED లైటింగ్ వంటి న్యూ ఏజ్ ఫీచర్స్ అందిస్తోంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధరను రూ. 5,000 తగ్గించింది. అయితే కంపెనీ మిడ్-లెవల్ వేరియంట్ ధరను రూ. 10,000 తగ్గించింది. దీపావళి తర్వాత, బజాజ్ పల్సర్ శ్రేణిలోని కొన్ని మోడళ్ల ధరలను కూడా తగ్గించింది. బజాజ్ ఆటో ఈ ఏడాది జూలై 5న CNGతో నడిచే మోటార్‌ సైకిల్ ఫ్రీడం 125ని విడుదల చేసింది. కంపెనీ ప్రారంభించినప్పటి నుండి 80,000 ఫ్రీడమ్ మోటార్‌ సైకిళ్లను డీలర్‌లకు రవాణా చేసింది. అయితే, వాహన (వాహన్) రిటైల్ డేటా ఇప్పటివరకు కేవలం 34,000 యూనిట్లను అమ్మింది.

Tags:    

Similar News