Zero Interest Loan for Farmers: ఆ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే

Zero Interest Loan for Farmers: ఇప్పటివరకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న రైతు వ్యవసాయ పెట్టుబడితో పాటు రైతులు తీసుకున్న రుణంపై సున్నా వడ్డీ పథకం

Update: 2020-07-09 02:00 GMT
YSR Farmers Day

Zero Interest Loan for Farmers: ఇప్పటివరకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న రైతు వ్యవసాయ పెట్టుబడితో పాటు రైతులు తీసుకున్న రుణంపై సున్నా వడ్డీ పథకంలో భాగంగా దానికి అందించే వడ్డీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం జగన్మోహరెడ్డి వెల్లడించారు. ఈ సొమ్ములు నాలుగు రోజులు ఆలస్యమైనా కంగారు పడవద్దని, నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వ హాయాంలో సున్నా వడ్డీ పథకానికి గత ప్రభుత్వం గ్రహణం పట్టించింది. రైతులను మోసం చేసింది. దాదాపు 57 లక్షల మంది రైతులకు రూ.1,150 కోట్లు బకాయి పెట్టింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని మన ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే.. ఖరీఫ్, రబీ.. ఏ సీజన్‌కు ఆ సీజన్‌ పూర్తయ్యే నాటికి వారి వడ్డీ కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది.

ఏపీలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ జ‌యంతిని రైతు దినోత్స‌వంగా ఖ‌రారు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. నేడు ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క కామెంట్స్ చేశారు. రైతుకు మేలు చేకూర్చిన మొదటి నాయకుడు వైఎస్‌ఆర్ అని కొనియాడారు‌. ఉచిత విద్యుత్‌ను గతంలో అనేకమంది ఎగతాళి చేశారని గుర్తుచేశారు. 104, 108 వాహనాలను ప్ర‌వేశ‌పెట్టి వైఎస్‌ఆర్ ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడార‌ని పేర్కొన్నారు‌. బోధన ఫీజుల చెల్లింపు, జలయజ్ఞం అంటే వైఎస్సాఆర్ మాత్ర‌మే గుర్తుకువ‌స్తార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో త‌మ ప్ర‌భుత్వం కూడా రైతుల‌కు ప‌క్ష‌పాతిగా ఉంటుంద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. సున్నావడ్డీ పథకం కింద నగదును ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ల‌లో జమ చేస్తామని తెలిపారు. ఉచిత విద్యుత్ రూపంలో ఒక్కో రైతుకు ఏటా 50 వేల రూపాయల ల‌బ్ది చేకూరుతుందని వివ‌రించారు.

ఈ అక్టోబరులోగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం రివ్యూ చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లో న‌గ‌దు జమ చేయడం అన్నది గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు. మొత్తం 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని.. నాలుగైదు రోజులు ఆలస్యమైనా రైతులు కంగారుపడ వద్దని జ‌గ‌న్ కోరారు.

ఇప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రూ.1,150 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెట్టిన వడ్డీ సొమ్ము. ఇది అంతకు ముందు ఏడాదికి చెందిన రుణాలకు సంబంధించినవి కాబట్టి, ఇవాళ బటన్‌ నొక్కిన వెంటనే అందరు రైతుల ఖాతాల్లో జమ కాకపోతే కంగారు పడొద్దు. నాలుగు రోజులు బ్యాంకులకు సమయం ఇవ్వాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కాల్‌ సెంటర్‌ నంబరు 1907కు ఫోన్‌ చేయాలి. 

Tags:    

Similar News