Rythu Bharosa Kendram : రైతు భరోసా కేంద్రాలకు 'వైఎస్సార్' పేరు

AP Govt ordered to rename the 'Rythu Bharosa Kendram' as Dr. YSR Rythu Bharosa Kendram : ఏపీ ప్రభుత్వం మరో...
AP Govt ordered to rename the "Rythu Bharosa Kendram" as Dr. YSR Rythu Bharosa Kendram : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును రైతు భరోసా కేంద్రాలకు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతు భరోసా కేంద్రాలను 'డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు'గా ప్రభుత్వం వ్యవహరించనుంది. రైతులకు మాజీ సీఎం వైఎస్సార్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలో రైతుల దగ్గరకే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాజాగా ఈ కేంద్రాలకు వైఎస్ఆర్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే వైఎస్సార్ జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వైఎస్సార్ పేరు కలిసేలా ఇప్పటికే పలు పథకాలను జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ
11 Aug 2022 4:00 PM GMT'బింబిసార' సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్
11 Aug 2022 3:45 PM GMTCorn Benefits: మొక్కజొన్న ఎనర్జిటిక్ ఫుడ్.. ఎలా తినాలంటే..?
11 Aug 2022 3:30 PM GMTసంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్...
11 Aug 2022 3:15 PM GMTSamuthirakani: సముద్రఖని దర్శకత్వంలో నితిన్
11 Aug 2022 3:00 PM GMT