YSR Birthday as Farmers day: వైయస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

YSR Birthday as Farmers day:  వైయస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

YSR Birthday as Farmers day: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని (జులై 08)ని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

YSR Birthday as Farmers day: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని (జులై 08)ని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రతి ఏడాది జులై 08న వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిచింది. రైతుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చారని ఆయన సంస్మరణార్థం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు. అలా అయన తీసుకున్న అనేక సంక్షేమ పధకాలే తిరిగి అయనని 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేశాయి. తద్వారా అయన వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.

ఇక అయన తనయుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యమంత్రిగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న జగన్ అనేక సంక్షేమ పధకాలను ప్రారంభిచారు. రైతు భరోసా కేంద్రాలు, రైతు బీమా, ఉచిత బోర్లు వంటి ఎన్నో పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అంతేకాకుండా రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories