Amaravati: వైసీసీ వర్సస్ టీడీపీ..అమరావతిలో ఉత్కంఠ, 144 సెక్షన్..!
Amaravati: అమరావతిలో పోలీసులు లాఠీ ఛార్జ్
Amaravati: వైసీసీ వర్సస్ టీడీపీ..అమరావతిలో ఉత్కంఠ, 144 సెక్షన్..!
Amaravati: అమరావతిలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి దూసుకొచ్చారు. రామలింగేశ్వర ఆలయానికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించారు. ఆలయానికి వెళ్లేందుకు కొమ్మాలపాటి యత్నిస్తున్నారు. కొమ్మాలపాటిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే నంబూరి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. ఎమ్మెల్యే నంబూరి ఆలయానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.