YS Sharmila: నేడు ఇడుపులపాయకు షర్మిల.. రేపు పీసీసీ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
YS Sharmila: రేపు ఉ.11 గంటలకు ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు
YS Sharmila: నేడు ఇడుపులపాయకు షర్మిల.. రేపు పీసీసీ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన వైఎస్ షర్మిల రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలను.. మూడు రోజుల క్రితమే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తూ.. హైకమాండ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలో వైఎస్ షర్మిల పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా.. నేడు ఇడుపులపాయకు వెళ్లనున్న షర్మిల అక్కడి వైఎస్ఆర్ ఘాట్‌కు నివాళి అర్పించనున్నారు. రేపు ఉధయం 10 గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులు, ఏఐసీసీ సభ్యులు, కో- ఆర్డీనేటర్లు హాజరుకానున్నారు. వీళ్లందరి సమక్షంలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం అధ్యక్షురాలి హోదాలో తొలిసారి ఆంధ్రరత్న భవన్‌లోని కార్యాలయానికి వెళ్లనున్నారు.