తండ్రిని మించిన తనయుడు.. షర్మిల ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయన చెల్లెలు షర్మిల ప్రశంసలు వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయన చెల్లెలు షర్మిల ప్రశంసలు వర్షం కురిపించారు. ఇవాళ పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలు విడుదల చేశారు. దీనిపై షర్మిల స్పందించారు. పేదలకు మేలు చేయడానికి తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే... తాను రెండు అడుగులు ముందుకేస్తానని తన అన్న వైఎస్ జగన్ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ పేదవాడికి మేలు చేయడంలో తండ్రినిమించిన తనయుడిగా సీఎం జగన్ నిలిచారని జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని షర్మిల ట్వీట్ చేశారు.
అంతకుముందుజగనన్న విద్యా దీవెన పథకాన్ని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థులు తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువాలన్న లక్ష్యంతో ఈ పథకం ప్రవేశ పెట్టారు.విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు లేకుండా ఒకే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం 4వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1 వేయి 880 కోట్ల బకాయిల చెల్లింపును కూడా విడుదల చేశారు. ఈ పథకం 12లక్షల మంది తల్లుల ద్వారా వారి పిల్లలకు లబ్ధి చేకూరనుంది.
'నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. పేదవాడికి మేలు చేయడానికి నేను రెండు అడుగులు ముందుకేస్తా'నని @ysjagan అన్న మాటిచ్చారు.ఆ పేదవాడికి మేలు చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. అన్న ప్రారంభించిన ' #JaganannaVidyaDeevena ' చరిత్రలో నిలిచిపోతుంది#FeesReimbursement #YSJagan pic.twitter.com/q16BixNKic
— YS Sharmila (@ys_sharmila) April 28, 2020