YS Jagan: వీర జవాన్‌ మురళీ నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం

YS Jagan: దాయాది పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.

Update: 2025-05-13 09:49 GMT

YS Jagan: వీర జవాన్‌ మురళీ నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం

YS Jagan: దాయాది పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ ఉదయం బెంగళూరు నివాసం నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి, శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్న ఆయన, మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతిబాయిలను జగన్ పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. వీర జవాన్ చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని తెలిపారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన సాహసం అందరికీ స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సాయంను మురళీ నాయక్ కుటుంబానికి ప్రకటించారు. అలాగే కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.

హృదయాన్ని కదిలించిన తండ్రి మాటలు

జగన్ నివాళులు అర్పిస్తున్న సమయంలో, మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ మాట్లాడుతూ.. "మురళీ… నీ కోసం జగనన్న వచ్చాడు… లేచి సార్‌కి సెల్యూట్ కొట్టరా!" అని అన్న మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర జవాన్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అదనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతంగా రూ. 25 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News