Congress: బాలాకోట్‌ సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న ప్రజలు!

Congress MP no one saw surgical strikes remark gets BJP go to Pak reply Telugu news
x

Congress: బాలాకోట్‌ సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న ప్రజలు!

Highlights

ప్రస్తుత ఉద్విగ్న పరిస్థితుల్లో భారత సైన్యం చర్యలపై అనుమానాలు వ్యక్తం చేయడం తగదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Congress: కాంగ్రెస్ ఎంపీ, మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ప్రశ్నలు వేస్తూ.. "అవి ఎక్కడ జరిగాయో కనిపించలేదు, ఏ ఆధారాలు లేవు" అని ఆయన వ్యాఖ్యానించడంతో భారతీయ జనతా పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక చన్నీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే, కాంగ్రెస్ పార్టీ పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని కఠినంగా స్పందించాలని డిమాండ్ చేసింది. పహల్గాం ఘటన జరిగి పది రోజులు అవుతున్నా కేంద్రం నుంచి గణనీయమైన చర్యలు కనిపించలేదని, దేశ ప్రజలు ఇప్పుడు “56 అంగుళాల ఛాతీ” ఏం చేస్తుందో చూడాలని ఎదురుచూస్తున్నారని చన్నీ అన్నారు.

చన్నీ వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన ఢిల్లీ మంత్రి మన్జీందర్ సింగ్ సిర్సా, ఆయన వ్యాఖ్యలు సైనికుల మనోధైర్యాన్ని దిగజారేలా చేస్తున్నాయని ఆరోపించారు. “పాక్‌కెళ్లి మీరు స్వయంగా స్ట్రైక్ స్థలాన్ని చూసేయొచ్చు” అంటూ తీవ్రంగా విమర్శించారు.

ఇక బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కాదు Pakistan Working Committee అని వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా పాక్ ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి సుపరిపాలనతో కూడిన ఆక్సిజన్ అందిస్తున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పహల్గాం దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసింది. అయినా, చన్నీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో స్వరం భిన్నంగా ఉన్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఉద్విగ్న పరిస్థితుల్లో భారత సైన్యం చర్యలపై అనుమానాలు వ్యక్తం చేయడం తగదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది దేశ భద్రతా దళాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని విశ్లేషకుల హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories