ఇవాళ జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల

Jagan: సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం అందించనున్న ప్రభుత్వం

Update: 2023-12-20 03:54 GMT

ఇవాళ జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల

Jagan: పేద విద్యార్థులకు సైతం విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తూ.. మరోవైపు సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ.. జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం జగన్‌ ఇవాళ అందించనున్నారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 42.6 కోట్ల రూపాయలను తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.

అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఆడుదాం ఆంధ్రాపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడా పోటీలను నిర్వహించనుంది ప్రభుత్వం. ఇక.. సాయంత్రం విజయవాడలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

Tags:    

Similar News