YS Jagan: విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారు
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan: విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారు
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా లొంగిపోయారని విమర్శించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. "విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు ఎలాంటి విలువ ఉండదని, ఆయన ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి మేలు చేయడానికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని" ఆరోపించారు. విజయసాయిరెడ్డికి ఇంకా మూడున్నరేళ్ల రాజ్యసభ పదవీకాలం ఉండగా, చంద్రబాబు కూటమికి మేలు చేయడానికి రాజీనామా చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో, ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశమే లేదన్న విషయం విజయసాయిరెడ్డికి బాగా తెలుసు అని తెలిపారు.
తన పదవిని, మూడున్నరేళ్ల హక్కును చంద్రబాబు కూటమికి అమ్ముకున్నాడు. అలాంటి వ్యక్తి చేసే ప్రకటనలకు ప్రజలు గానీ, పార్టీ నాయకులు గానీ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.