YS Jagan: వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం.. మళ్లీ పాదయాత్రకు రెడీ!
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రతి వారం ఒక్కో నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల మధ్య ఉండనున్నట్లు తెలిపారు.
YS Jagan: వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం.. మళ్లీ పాదయాత్రకు రెడీ!
YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర విరామం తర్వాత మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ప్రజల మధ్యే ఉండి సమస్యలను నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం చొప్పున పాదయాత్ర నిర్వహిస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలం పూర్తిగా ప్రజల మధ్యే గడుపుతానని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో నిరంతరం భేటీ అవుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటానని తెలిపారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగన్, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. పాలన అంతా అబద్ధాలు, మోసాలతో నిండిపోయిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీని మళ్లీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో పాదయాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.