హైదరాబాద్‌కు వైఎస్ భాస్కర్‌రెడ్డి తరలింపు

* భాస్కర్‌రెడ్డిని జడ్జి ఎదుట హాజరుపర్చనున్న సీబీఐ అధికారులు

Update: 2023-04-16 04:12 GMT

హైదరాబాద్‌కు వైఎస్ భాస్కర్‌రెడ్డి తరలింపు

Bhaskar Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీ చేశారు. భాస్కర్ రెడ్డిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారం తెలిపారు. భాస్కర్ రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్ కు తరలించారు. అయితే భాస్కర్‌రెడ్డిని తీసుకెళ్లే క్రమంలో అవినాష్ అనుచరులు సీబీఐ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆయనను సీబీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసి ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు సీబీఐ తేల్చింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వివేకా కేసులో కీలకంగా మారింది.

పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న అవినాష్ రెడ్డి.. ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు కడపకు చేరుకోనున్నారు. దీంతో సీబీఐ అధికారులు ఆయన ఇంటికి చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది. అయితే హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి కూడా మరో సీబీఐ బృందం చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.

Tags:    

Similar News