Visakhapatnam: యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో మాస్కులు పంపిణీ

Update: 2020-04-27 08:57 GMT
విశాఖపట్నం: శ్రీ నరసింహ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రీ అప్పలస్వామి సింహాచలం మార్కెట్ సెంటర్లో చిరు వ్యాపారం చేసుకున్న వర్తకులకు కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన

జాగ్రత్తలు వివరిస్తూ వారికి సుమారుగా వంద మంది చిరు వ్యాపారస్తులకు, మాస్కులు హ్యాండ్ కాప్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కర్రి అప్పలస్వామి మాట్లాడుతూ... ప్రజలంతా లాక్ డౌన్నిబంధనలు పాటించి మే 3 వరకు ఇంటి వద్దనే ఉండి పరిశుభ్రంగా ఉంటూ ఈ వైరస్ నాశనం అయ్యే వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడవివరం సహకార పరపతి సంఘం సభ్యులు బంటుపల్లి మహేశ్వరరావు, అప్పారావు, పైడ్రాజు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News