Butta Renuka: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారం
Butta Renuka: జగన్ నవరత్నాలు వివరిస్తూ బుట్టా రేణుక ఇంటింటి ప్రచారం
Butta Renuka: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారం
Butta Renuka: సీఎం జగన్ చేసిన అభివృద్ధే తమకు తిరిగి అధికారాన్ని కట్టబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు బుట్టా రేణుక. గోనెగండ్ల, కడిమెట్ల గ్రామాల్లో పర్యటించి.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతాయన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఓటు చాలా అమూల్యమైనదన్న బుట్టా రేణుక.. ప్రతిఒక్కరూ దానిని ఉపయోగించుకొని వైసీపీని గెలిపించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.