Lakshmi Parvathi: ఆస్కార్ అవార్డును దాటిపోయేలా చంద్రబాబు నటన.. బాలయ్య బాబుకు ఈ విషయం తెలియదు..
Lakshmi Parvathi: చంద్రబాబు మాయలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పడొద్దని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు.
Lakshmi Parvathi: ఆస్కార్ అవార్డును దాటిపోయేలా చంద్రబాబు నటన.. బాలయ్య బాబుకు ఈ విషయం తెలియదు..
Lakshmi Parvathi: చంద్రబాబు మాయలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పడొద్దని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు నాటకాన్ని గుర్తించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కళ్లు తెరవాలన్నారు. ఆనాడు తనకు కావాల్సినంత డబ్బు ఇస్తానని, విదేశాలకు వెళ్లిపోవాలని చంద్రబాబు తనను కోరాడని.. బాలయ్య బాబుకు ఈ విషయం తెలియదని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నాడని.. ఆయన మాటలను నమ్మవద్దని కోరారు.
చంద్రబాబుపై పోరాటం చేసేందుకే తాను వైసీపీలో చేరానని.. తన సిద్ధాంతం, జగన్ సిద్ధాంతం ఒక్కటేనన్నారు. చంద్రబాబును భార్యను వైసీపీ నాయకులు ఏమీ అనలేదన్నారు. ఆడవాళ్లను రాజకీయం కోసం ఉపయోగించింది చంద్రబాబేనన్నారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు గురించి ఎన్టీఆరే స్వయంగా చెప్పారు కదా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన నటనతో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డును దాటిపోయేలా చంద్రబాబు నటిస్తున్నాడు. నన్ను మించిన నటుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. చంద్రబాబు ఒక నీచుడు, నికృష్టుడు. మహిళలను కించపరిచి, వాడుకుంటున్నది చంద్రబాబేనన్నారు లక్ష్మీపార్వతి.