బద్వేలు ఉపఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు అధిష్టానం పిలుపు
* ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాయంలో సీఎంను కలవనున్న సుధ * ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం
వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు అధిష్టానం పిలుపు
Andhra Pradesh: బద్వేలు ఉపఎన్నికల వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఆమె కలవనున్నారు. అభ్యర్థి సుధతో పాటు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉపఎన్నికపై నేతలకు బాధ్యతలు, ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.