Visakhapatnam: సాగర తీరంలో ఘనంగా ''చేనేత చీర నడక''
Visakhapatnam: ఆగస్టు7న జాతీయ చేనేత దినోత్సవం
Visakhapatnam: సాగర తీరంలో ఘనంగా ''చేనేత చీర నడక''
Visakhapatnam: జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విశాఖ సాగరతీరంలో మహిళలు చేనేత కార్మికులకి చేయూత ఇవ్వాలని సంకల్పిస్తూ చేనేత వాక్ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు చీర కట్టులో వచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు.భారతీయ వనితల హుందాతనం చీర లోనే ఉంటుందని నినాదాలు చేశారు.