Why YSRCP high command serious on four Leaders: నలుగురు వైసీపీ నేతలపై అధిష్టానం ఆగ్రహం ఎందుకు?

Update: 2020-07-24 12:36 GMT

Why YSRCP high command serious on four Leaders : ఎన్నికల ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటారు అనుకుంటే, పాత పాటే పాడుతున్నారు. పదవుల పందేరంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పదవిస్తే ఓకే, లేకపోతే ఫైటే అన్నట్టుగా ఉరిమి ఉరిమి చూస్తున్నారు. జండూబామ్ రాసుకున్నా, వైసీపీ అధిష్టానానికి తలనొప్పి తగ్గడం లేదుట. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? వారి పితలాకటం ఏంటి?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఆ పార్టీకి కంచుకోటగా చెప్పుకుంటారు. టిడిపి పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి మినహా అక్కడ వారికి ఓటమి లేదు. 2019 ఎన్నికల్లోనూ అదే రుజువైంది. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచినా, ఇక్కడ మాత్రం సైకిల్ జోరుకు వైసిపి నేతలు బ్రేకులు వేయలేకపోయారు. ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని చూసిన వైసీపీ పెద్దల ప్రయత్నాలు బెడిసికొట్టాయట. అయినా, ఆ నియోజకవర్గంలో నలుగురు నేతల పితలాటకంపై వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. విజువల్స్

ఎన్నికలు అయిపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. అయితే ఇప్పటికీ ఇచ్చాపురంలో మారని పరిస్థితులు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నయాట. ఇచ్చాపురంలో పట్టు సంపాదించుకోవడం కోసం పార్టీ ఇస్తున్న అవకాశాలాను అక్కడి నేతలు అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కాగా పార్టీలో నెలకొన్న పితలాటకం పోగొట్టాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల్లో ఓటమి చెందిన సాయిరాజ్‌కు, పార్టీ ఇటీవల జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గంపై పట్టు సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం ఏమి మారలేదట. ఇచ్చాపురంలో మునిసిపల్ చైర్మన్, ఆమె భర్త వారి వ్యతిరేక వర్గాల వైరంతో, పార్టీ రెండుగా చీలిపోగా, కవిటి మండలంలో నర్తు రామారావు వర్గం, నర్తు నరేంద్ర వర్గం ఎవరికీ వారే అన్నట్లు వ్యవహిస్తున్నారట.

ఇక కంచిలిలో నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా, ఇప్పటికే ఆ మండలంలో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండగా, ప్రస్తుతం ఇదే అంశం అక్కడ పార్టీలో చీలికలకు కారణమయ్యిందట. అన్ని మండలాల్లోనూ ఇవే కోల్డ్‌వార్‌ మంటలట. దీంతో ఇచ్చాపురం వైసీపీ గందరగోళంగా మారిందట. పదవి వచ్చిన తర్వాత కూడా సాయిరాజ్ పరిస్థితులను చక్కబెడతారు అనుకుంటే, పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని ఆ పార్టీకి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారట.

ఇదిలావుంటే, ఇచ్చాపురం వైసిపిలో ఆధిపత్య పోరు పీక్స్ చేరడానికి, మరో రగడ నివురుగప్పిన నిప్పులా వుందట. ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలే నియోజకవర్గ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌ల నియామకాలు జరగలేదు. అయితే ఆ ప్రక్రియ మొదలయ్యిందనే చర్చ తెరపైకి రావడంతో ఇంచార్జ్ పదవి కోసం ఇచ్చాపురం నేతలు ఒకరికి తెలియకుండా మరొకరు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇందులో భాగంగా కొందరు జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ చుట్టూ చక్కర్లు కొడుతుంటే, మరికొందరు ఆ పదవి తమకే ఇప్పించాలంటూ స్పీకర్ తమ్మినేని వద్దకు క్యూ కడుతున్నారట. దీంతో ఇప్పటికే జిల్లాలోని టెక్కలిలో ఇంచార్జ్ పదవి కోసం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుండగా, ఇచ్చాపురంలో కూడా అదే విధమైన పరిస్థితి నెలకొందట. ఇంచార్జ్ పదవి కోసం పిరియా సాయిరాజ్, లల్లు, నర్తు రామారావు, నర్తు నరేంద్రలతో పాటు ఇచ్చాపురం మునిసిపల్ చైర్మన్ భర్త సంతూ పేరు కూడా అనూహ్యంగా రేసులో ఉన్నట్లు మాటలు వినపడ్తున్నాయి. కష్టకాలంలో కూడా పార్టీనే నమ్ముకుని ఉన్నామని, అందుకే నియోజకవర్గ బాధ్యతలు తమకు అప్పజెప్పాలంటే, తమకు అప్పజెప్పాలంటూ ఎవరికీ వారు తమదైన శైలిలో పైరవీలు చేసుకుంటున్నారట.

మొత్తంగా చూస్తే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన ఇచ్చాపురం వైసిపి నేతల్లో, అలాంటి మార్పు కనిపించడంలేదని, సొంత పార్టీ కార్యకర్తలే రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అనేది పార్టీ అధిష్టానానికే అర్ధంకాని పరిస్థితిగా తయారయ్యిందట. చూడాలి, ఏమవుతుందో.

Full View


Tags:    

Similar News