ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షాలు..

ఉపరితల ఆవర్తనంతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2020-02-09 09:08 GMT

ఉపరితల ఆవర్తనంతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భూమి ఉపరితలానికి ఒకటిన్నర కిలోమీటరు పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు. మరోవైపు నిన్నటి నుంచి క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పలు ప్రాంతాలు చీకటిగా తయారయ్యాయి. కొన్ని పట్టణాల్లో ముసురుపెట్టింది. అంతేకాదు నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళనలు చెందుతున్నారు. ఒక్కరోజు కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు బురదమయమయ్యాయి.

Tags:    

Similar News