దేవుడి పేరుతో కుర్రాళ్ళ గానాబజానా..

Update: 2019-09-03 07:52 GMT

వినాయక చవితి మండపాల్లో అక్కడక్కడా అసభ్యకర డాన్సులు శృతిమించుతున్నాయి. దేవుడి ఉత్సవాల ముసుగులో కుర్రాళ్ళ గానాబజానా కొనసాగుతోంది. మండపాల పక్కనే రికార్డింగ్ డాన్సులతో హోరెత్తిస్తున్నారు. మండపం పక్కనే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలతో అసభ్యకర డాన్సులు వేయించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలో జరిగింది. ఐతే.. ఈ రికార్డింగ్ డాన్స్‌పై కొందరు మహిళలు పోలీసులకు సమాచారం అందించినా స్పందన కరువైంది. జోగింపేటలో అర్థరాత్రి దాటేవరకూ ఈ అసభ్యకరక నృత్యాలు కొనసాగాయి. నవరాత్రుల్లో ఇలాంటి పాడుపనులు చూసి పెద్దలు తిడుతున్నా అక్కడక్కడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. 

Tags:    

Similar News