Vizianagaram: డిజే సౌండ్‌కు యువకుడు బలి..!
Vizianagaram: విజయనగరం బొబ్బాదిపేటలో విషాదం చోటుచేసుకుంది. హరీష్ అనే యువకుడు డిజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు.
Vizianagaram: డిజే సౌండ్‌కు యువకుడు బలి..!
Vizianagaram: విజయనగరం బొబ్బాదిపేటలో విషాదం చోటుచేసుకుంది. హరీష్ అనే యువకుడు డిజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు. వినాయక ఊరేగింపు సందర్భంగా హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన హరీష్ ఇక లేడన్న సమాచారంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిజే సౌండ్స్ను నిషేధించకపోవడం వలన ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని డిజె సౌండ్స్ను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.