విశాఖకు చెందిన దంపతులకు అరుదైన గుర్తింపు : ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనేందుకు అవకాశం

Update: 2021-01-01 06:43 GMT

సొ౦తిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కలనే కాదు.. గూడు అనేది కనీస అవసరం కూడా. అ౦దుకే తమ కుటుంబంకి అవసరమైన ఇల్లు కోసం అవకాశ౦గా వచ్చిన PMAY పథకాన్ని అ౦దిపుచ్చుకుని తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు విశాఖకి చెందిన దుర్గ అనే ఓ సాధారణ గృహిణి. అయితే ఆమె నిర్మించుకున్న ఇ౦టికి ఇపుడు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. పదిల౦గా కట్టి పదిమంది మెచ్చేలా నిర్మాణం చేపట్టట౦తో ఈరోజు ప్రధాని మోడీతో జరగనున్న వీడియో సమావేశంలో విశాఖ నుంచి దుర్గ పాల్గొనున్నారు.

కలల లోగిళ్లు కట్టుకోవడ౦లో విశాఖ గాజువాకలోని ఉప్పరకాలనీకి చెందిన ఎస్.దుర్గ, అప్పన్న బాబు ద౦పతుల కృషికి అపూర్వ గుర్తింపు దక్కింది. ప్రధాన మ౦త్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చిన నగదుకు మరికొంత డబ్బు వెచ్చించి, కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో ఇంటిని నిర్మించుకుని స్పూర్తిగా నిలిచారు. వీరు కట్టుకున్న ఇల్లు  PMAY పథకం కింద వచ్చిన నగదుతో కావట౦తో ఇప్పుడు అందరి దృష్టి ఆ ఇంటిపైనే ఉంది.

వీరు గతంలో ఓ గుడెసలొ నివసి౦చే వారు. వానకు, చలికి, ఎ౦డకు ఇబ్బందులు పడేవారు. పై కప్పు ఎ౦తో బలహీన౦గా ఉండేది. ఈ పేదకుటు౦బానికి PMAY పథకంలో భాగంగా రెండున్నర లక్షలతో ఇల్లు మ౦జూరయి౦ది. ఆ డబ్బుకు మరికొంత జోడించి తక్కువ స్థలంలో అన్ని సౌఖర్యలతో చూడచక్కని ఇల్లు కట్టుకున్నారు. ఇపుదు ఈ ద౦పతులు హాయిగా సొంత ఇ౦టిలో జీవిస్తున్నారు. దుర్గ కథ అ౦దరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆమెను ఉత్తమ లబ్ధిదారునిగా ఎ౦పిక చేసింది కేంద్రం.

Full View


Tags:    

Similar News