Visakhapatnam: ఒరిస్సా కూలీలకు సరుకులు అందించిన ఎమ్మార్వో

Update: 2020-04-15 16:28 GMT

విశాఖపట్నం: పశ్చిమనియోజకవర్గ సమన్వయ మళ్ల విజయప్రసాద్ అదేశాలు మేరకు బుధవారం నాడు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కరోనా లాక్ డౌన్ కారణంగా గత 22 రోజుల నుండి సొంత ఉరులుకి వెళ్లలేక ఉండిపోయిన ఒరిసా కూలీలకు బుధవారం నాడు 100 కేజీల బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.

గోపాలపట్నం మండలం ఎమ్మార్వో రాణి, సిఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండర్ సాదిక్ మిశ్రి, 52 ,90 వ వార్డు ల వైస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు జియ్యని శ్రీధర్, చుక్క ప్రసాద రెడ్డి , ఆర్థిక సహాయంతో నగర ప్రదాన కార్యదర్శి ఎల్లపు వెంకటేశ్వర రావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags:    

Similar News